News


31 శాతం క్రాష్‌....10 ఏళ్ల కనిష్ఠానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Monday 15th July 2019
Markets_main1563171227.png-27066

గత కొన్ని క్వార్టర్లలో జరిగిన పరిణామాల కారణంగా..భవిష్యత్తులో కంపెనీగా కొనసాగలేమోనన్న ఆందోళనను హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వ్యక్తం చేయడంతో సోమవారం(జులై 15) ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ 30.58 శాతం పడిపోయి రూ.47.55 వద్ద ట్రేడవుతోంది. సోమవారం రూ.61.65 వద్ద ప్రారంభమైన ఈ షేరు జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. 
ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి 
గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు వచ్చాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. రూ.3,280 కోట్ల అదనపు కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని, తమ కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక నష్టమని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.134 కోట్ల నికర లాభం వచ్చిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి  రూ.1,036 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది.  2018, సెప్టెంబర్‌ తర్వాత రుణాల మంజూరు, రుణ వృద్ది భారీగా పడిపోయాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. దీంతో క్యూ3, క్యూ4 ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడిందని, ఇది మొత్తం ఆర్థిక సంవత్సరం పనితీరుపై ప్రభావం చూపించిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడి ఉందని పేర్కొంది.
రుణ మంజూరీలు పడిపోయాయి..
నిధులు సమీకరించే సత్తాను కోల్పోయామని, వ్యాపారం పూర్తిగా అడుగంటిదని, రుణ మంజూరీలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. ఈ పరిణామాలన్నింటి కారణంగా భవిష్యత్తులో కంపెనీగా కొనసాగగలమో లేమోనన్న సందేహాలు వస్తున్నాయని వివరించింది. పరిష్కార ప్రక్రియ తుది దశలో ఉందని, దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే రుణదాతలకు సమర్పిస్తామని తెలిపింది. మూలధన నిధులందించే వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ అన్వేషణ కూడా దాదాపుగా పూర్తి కావచ్చొందని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మరో రెండు వారాల్లో కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ ప్రమోటర్లు.. తమ వాటాలో దాదాపు సగాన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలకు విక్రయించి రూ.6,900 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ కంపెనీ ప్రమోటర్లైన వాధ్వాన్‌ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. 

 You may be interested

పెద్దలకు హెల్త్‌ పాలసీ సాధ్యమే

Monday 15th July 2019

ప్రీమియం మాత్రం ఖరీదు అయినా సరే తీసుకోవడమే సురక్షితం అప్పటికే ఉన్న వ్యాధులకూ కవరేజీ కాకపోతే పరిమితులు ఎక్కువ కోపేమెంట్‌, రూమ్‌రెంట్‌ క్యాప్‌ గమనించాలి తక్కువ పరిమితులున్న పాలసీ బెటర్‌ పాలసీ లేకపోతే ఆర్థికంగా బోలేడు భారం అందుకే 60 దాటితే హెల్త్‌ పాలసీ ఎంతో అవసరం చెన్నైకు చెందిన సుమీత్‌ (60) ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ప్రైవేటు రంగంలో పనిచేసినంత కాలం సంస్థ తరఫున గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అతడి కుటుంబ సభ్యుల అవసరాలను ఆదుకుంది. కానీ,

ఇండిగో లొసుగులపై సెబీ దృష్టి

Monday 15th July 2019

- రంగంలోకి కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా - గంగ్వాల్‌ ఆరోపణలపై వివరణకు ఆదేశించే అవకాశాలు న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేష్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు

Most from this category