News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 10 శాతం క్రాష్‌

Monday 5th August 2019
Markets_main1564986428.png-27537

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొన్ని ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీకి ఆడిట్‌ సేవలు అందించే డెల్లాయిట్‌ కంపెనీ బాధ్యతలనుంచి తప్పకున్నట్లు వార్తలు వెలుగులో రావడం ఇందుకు కారణమైంది. ఈ అంశంపై వివరణ కోరగా ఇరుసంస్థలు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో నేడు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 12.50శాతం నష్టపోయి రూ.40.85 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఈ ధరకు షేరు 2నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:40ని.లకు షేరు గతముగింపు ధర(రూ.46.65)తో పోలిస్తే 9.50శాతం నష్టంతో రూ.42.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీకు చెల్లించాల్సిన రూ.150 కోట్ల చెల్లింపుల్లో సగం మాత్రమే చెల్లించగలిగింది. ఆగ‌స్ట్ 02, 03 తేదీల్లో ఎన్‌సీడీల‌పై చెల్లించాల్సిన రూ.92.1 కోట్ల వ‌డ్డీ చెల్లింపులు విఫ‌లం కావడంతో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలుగులోకి రావడం కూడా షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఏడాది(2019)లో షేరు 81.3శాతం నష్టపోయింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 40.85  రూ.690.00లుగా నమోదయ్యాయి.



You may be interested

2 ట్రిలియన్‌ డాలర్‌ క్లబ్‌ నుంచి భారత్‌ మార్కెట్‌ బయటకు!

Monday 5th August 2019

దేశియ స్టాక్‌ మార్కెట్‌ (బీఎస్‌ఈ) రేండేళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్నా 2 ట్రిలియన్‌ మార్కె‍ట్‌ క్యాప్‌(ఎం-క్యాప్‌) క్లబ్‌ నుంచి నిష్క్రమించింది.   ఆగస్టు 2 నాటికి అన్ని లిస్టెడ్ ఇండియన్ స్టాక్స్ విలువ 1.97 ట్రిలియన్ డాలర్లకు పడిపోవడం గమనర్హం. ఫలితంగా అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ క్లబ్‌లో భారత ర్యాంక్‌ జర్మనీకి దిగువన 9 వ స్థానానికి దిగజారింది.      బడ్జెట్‌ తర్వాత ఎఫ్‌ఐఐలు దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి

మెటల్‌ షేర్ల భారీ పతనం

Monday 5th August 2019

మార్కెట్‌ పతనంతో భాగంగా మెటల్‌ షేర్లు సోమవారం భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 4శాతం క్షీణించింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,428.20 వద్ద మొదలైంది. నేడు మార్కెట్లో జరుగుతున్న అమ్మకాల కారణంగా నిఫ్టీ ఇండెక్స్‌ ఒకదశలో 4శాతం వరకు పతనమై 2,459.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స​ గతముగింపు(2459)తో

Most from this category