News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 9.50శాతం అప్‌

Wednesday 3rd July 2019
Markets_main1562143916.png-26766

కొత్త రుణాల జారీకి  రుణదాతలు ఆమోదం తెలపడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో సెషన్‌లో 9.50శాతం ర్యాలీ చేశాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.75.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతేడాది సెప్టెంబర్‌లో తలెత్తిన ద్రవ్య సంక్షోభం నాటి నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొత్తగా ఎలాంటి రుణాలను జారీ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 30 మంది రుణదాతల కన్సార్షియం సమావేశం నిర్వహించింది. కంపెనీ వ్యాపారంలో భాగంలో ఏడాదికి రూ.12,000 నుంచి రూ.18,000 కోట్ల వరకు కొత్త రుణాలను జారీ చేసేందుకు కన్సార్టియం ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ద్రవ్యకొరతను నివారణ, వ్యాపార అవసరాల నిమిత్తంతో పాటు నిరర్థక ఆస్తులను పునరుద్ధరణలో భాగంగా కన్సార్షియం అదనపు రుణాలను మంజూరు చేయవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగి 9.50శాతం ర్యాలీ చేసి రూ.82.35ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు గత ముగింపు(రూ.75.30)తో పోలిస్తే 8.50శాతం లాభపడి రూ.81.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.60.00 రూ.690.00లుగా నమోదయ్యాయి. 
ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 65.11 పాయింట్లు పెరిగి 39,881.59 వద్ద, నిఫ్టీ 16.30 పాయింట్లు లాభపడి 11,926.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Wednesday 3rd July 2019

ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల బాట పట్టిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ(పీఎస్‌యూ)షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికల్లా తిరిగి లాభాల్లోకి మళ్లాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌  నేడు 3,207.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేవైసీ నిబంధలను ఉల్లఘించినందుకు ఆర్‌బీఐ 4 ప్రభుత్వరంగ బ్యాంకులపై రూ.1.75 కోట్ల జరిమానా విధించింది. వాటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంకులపై రూ.50లక్షలు, కార్పోరేషన్‌ బ్యాంకుపై

బడ్జెట్‌లో పన్నులు పెంచకపోతే చాలు: దీపన్‌ మెహతా

Wednesday 3rd July 2019

బడ్జెట్‌పై అంచనాలు లేవు.. ఫైనాన్సియల్‌ మార్కెట్లు నిజ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయి ఫలితాల సీజన్‌లో సాఫ్టవేర్‌ కంపెనీలు ముందుండి నడిపిస్తాయని అనుకోవడంలేదని, అనుహ్య సానుకూలతను సిమెంట్‌ రంగం నుంచి ఆశించవచ్చని ఎలిక్షిర్‌ ఈక్విటీస్‌ డైరక్టర్‌ దీపన్‌ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.... ఫలితాల సీజన్‌లో..ఐటీ కంపెనీలు గత జూన్‌ త్రైమాసికం నుంచి సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ మంచి పనితీరు ప్రదర్శిస్తోంది. అందువలనే ఆర్థిక సంవత్సరం 2018-19లో మిడ్‌,

Most from this category