News


ఫలితాల వాయిదా: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 13.50శాతం డౌన్‌..!

Friday 28th June 2019
Markets_main1561714904.png-26660

కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల ప్రక్రియ వాయిదా పడటంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.82.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ జూన్‌ 29న శనివారం వెల్లడించాల్సిన గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను జూలై 13కు వాయిదా వేస్తున్నట్లు కంపెనీ నేడు ఎక్చ్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అడిట్‌ కమిటీ సభ్యులను నిర్థారించడానికి  కొందరు డైరెక్టర్లు​ అందుబాటులో లేకపోవడంతో ఫలితాలు వాయిదా వేయాల్సి వచ్చినట్లు కంపెనీ వివరణ ఇచ్చింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో అగ్రగామి పేరొందిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఇప్పుడు ద్రవ్య కొరతను ఎదుర్కోంటుంది. కంపెనీ ఇటీవల రూ. 375 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్ చెల్లింపుల్లో కేవలం రూ. 150 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగిలిన  60 శాతం రుణాన్ని రెండు రోజుల్లోగా చెల్లిస్తామని కంపెనీ తెలియజేసింది. అలాగే తన అనుబంధ సంస్థలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అసెట్‌ మేనేజర్స్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా ట్రీస్టస్‌లో గల వాటాలను విక్రయించనున్నట్లు బుధవారం తెలియజేసిన విషయం విదితమే. ఈ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 13.50శాతం నష్టపోయి 70.70 వద్ద ఇంట్రాడే గరిష్టానికి తాకింది.  మధ్యాహ్నం గం.2:50ని.లకు షేరు గత ముగింపు(రూ.81.70)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.71.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట స్థాయిలు రూ.60.00 రూ.690.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

కళతప్పిన మెటల్‌ షేర్లు

Friday 28th June 2019

మార్కెట్‌ ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు కళ తప్పాయి. శుక్రవారం నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐరన్‌ ఓర్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా స్టీల్‌ మిల్స్‌ ప్రాఫిట్‌ మార్జిన్లు 50శాతం కంటే తక్కువగా నమోదు అయ్యాయి. ఐరన్‌ ఓర్‌ ధరల పెరుగుదల కంపెనీల ఆదాయాలు క్షీణించడంతో పాటు కంపెనీ షేర్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. దీంతో దేశీయ

బడ్జెట్‌ బాగుంటే ఈ షేర్లు కొనొచ్చు!

Friday 28th June 2019

అనలిస్టుల టాప్‌ 10 రికమండేషన్లు ఈ వారం రానున్న కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌ ఆశలకు అనుగుణంగా ఉంటే దృష్టి పెట్టాల్సిన టాప్‌ 10 స్టాకులను వివిధ నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. 1. ఐసీఐసీఐ బ్యాంకు: బ్యాంకు తాజా ఫలితాల్లో నికర ఎన్‌పీఏలను గణనీయంగా తగ్గించుకుంది. ఎన్‌ఐఐలో 27 శాతం మెరుగుదల నమోదయింది. రిటైల్‌బ్యాంకింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది.  2. మారికో: వచ్చే రెండుమూడేళ్లలో బలమైన క్యాపెక్స్‌ వ్యయం నమోదు చేయాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. గత

Most from this category