News


సీపీలను చెల్లించలేక నష్టపోయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Wednesday 26th June 2019
Markets_main1561525997.png-26575

కమర్షియల్‌ పేపర్స్‌(సీపీ) తిరిగి చెల్లింపులో జాప్యం చేయడంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బుధవారం(జూన్‌26) ట్రేడింగ్‌ ప్రారంభంలో 9 శాతం నష్టపోయింది. రూ.375 కోట్ల సీపీ చెల్లింపులను చేస్తానని మాటయిచ్చి మంగళవారం 40 శాతం మాత్రమే తిరిగి చెల్లించింది. మిగిలిన నగదును రెండు రోజుల్లో తీరుస్తామని కంపెనీ తెలిపింది.  అమ్మిన ఆస్తికి సంబంధించిన నగదు సమయానికి చేతికందలేదని కంపెనీ వివరించింది. ‘ మేం చెల్లించవలసిన రూ.375 కోట్లలో 40 శాతం చెల్లించాం. మిగిలిన రూ.225 కోట్లను రెండు రోజుల్లో తీరుస్తాం’ అని కంపెనీ మంగళవారం ‍ప్రకటించింది. ఈ నెల ఈద్‌కు ముందు కంపెనీ గత ఏడాది ఇష్యు చేసిన బాండ్లపై వడ్డీలను చెల్లించడంలో విఫలమైంది. డీఫాల్ట్‌ ట్యాగ్‌ను తప్పించుకోడానికి ఈ బకాయిలను నిర్ణిత సమయంలో చెల్లించింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం వలన తనఖా రుణదాతలు, బ్యాంకింగేతర రుణదాతలు తీవ్రంగా నష్టపోయారు. 2018 డిసెంబర్‌ చివరికి రూ.1.3 లక్షల కోట్ల ఆస్తుల నిర్వహణ, రూ.90,000 కోట్ల అప్పులతో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ మూడవ అతి పెద్ద గృహ రుణ సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. 
ఉదయం 10.33 సమయానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు 2.19శాతం నష్టపోయి రూ.73.75వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

నష్టాల్లోంచి లాభాల్లోకి...

Wednesday 26th June 2019

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైనప్పటికీ.., తిరిగి లాభాల్లో మళ్లింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా ఉత్తర, మధ్య భారతదేశమంతటా విస్తరించాయనే ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫార్మా, అటో, ఆర్థిక, బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. అలాగే మెటల్‌ షేర్లు

పెరిగిన చమురు

Wednesday 26th June 2019

అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తోడు అమెరికా ఆయిల్‌ నిల్వలు అనుకోని రీతిలో తగ్గడంతో బుధవారం (జూన్‌ 26) ట్రేడింగ్‌లో చమురు ధరలు ఒక శాతం పెరిగి ఈ నెలలో గరిష్ఠాన్ని తాకాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ 1.4శాతం పెరిగి బ్యారెల్‌కు 65.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 31 తర్వాత చమురుకు ఇదే  గరిష్ఠ స్థాయి. గత నెల మే 31న బ్రెంట్‌ ​క్రూడ్‌ బ్యారెల్‌కు 66.00 డాలర్లను

Most from this category