News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 36 శాతం జంప్‌

Tuesday 6th August 2019
Markets_main1565084551.png-27579

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లి.(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తయారుచేసిన రిజల్యూషన్‌ ప్లాన్‌ డ్రాప్ట్‌ను ఆమోదించింది. ఈ డ్రాఫ్ట్‌ ప్రణాళికను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఈ ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫైనాన్సియల్‌ సలహాదారు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో తయారు చేసింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం మధ్యాహ్నం 3.06 సమయానికి  36.71 శాతం లాభపడి, రూ. 57.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో ఈ షేరు రూ.41.95 వద్ద ముగిసింది.
   ఏ ఒక్క రుణదాత అసలులో ఎటువంటి హెయిర్‌ కట్స్‌ ఉండవని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ కంపెనీ పేర్కొంది. ఆస్తి-బాధ్యత అసమతుల్యతను పరిష్కరించే రిజల్యూషన్‌ ప్రణాళిక వలన చెల్లింపులపై తాత్కాలిక విరామం కలుగుతుందని వివరించింది. రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి బ్యాంకులు లేదా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి) నుంచి నిధులును సమీకరించుకునేందుకు డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రయత్నిస్తుంది. కాగా ఈ కంపెనీ రుణ భారంతో ఇబ్బందులు పడుతుందని, ఆడిటర్లు డెలాయిట్, హస్కిన్స్ అండ్‌ సెల్స్ ఎల్ఎల్‌పి ఈ కంపెనీ ఆడిట్‌ పనుల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

 



You may be interested

టైటాన్‌ లాభం..రూ. 370.7 కోట్లు

Tuesday 6th August 2019

టైటాన్ కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ .370.7 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ లాభాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ప్రకటించిన స్టాండ్‌ ఎలోన్‌ లాభం రూ. 349.2 కోట్ల కంటే 6.2 శాతం అధికం కావడం గమనర్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .4,319 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం, ఈ జూన్‌ త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రూ .4,939.7 కోట్లకు

ఐదేళ్ల కోసం... ప్రస్తుతం ఇన్వెస్ట్‌ చేయోచ్చు

Tuesday 6th August 2019

మార్కెట్లలో పతనం ఇన్వెస్టర్లను నిరాశావాదం వైపు నడిపించకూడదు. ఈ పరిస్థితిని మార్కెట్లలో కొనుగోలు చేయడానికి, రాబోయే ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశంగా చూడాలని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. కార్పోరేట్‌ ఆదాయాలపై అంచనాలు లేవు.. సానుకూల లేదా ప్రతికూల కార్పోరేట్‌ ఆదాయాలు మార్కెట్లను ఆశ్య్చర్యపరచలేదు. కార్పోరేట్‌

Most from this category