News


ధన్‌తెరాస్‌ ఎఫెక్ట్‌: ఏడాది గరిష్ఠానికి టైటాన్‌

Friday 25th October 2019
Markets_main1571984481.png-29137

   ధన్‌తెరాస్‌ ప్రభావంతో డైమండ్‌, ఆభరణాల షేర్లు శుక్రవారం సెషన్లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. టైటాన్‌ షేరు స్వల్పంగా పెరిగి ఏడాది గరిష్ఠాన్ని తాకింది. ఉదయం 11.37 సమయానికి టైటాన్‌ షేరు 0.60 శాతం లాభపడి రూ. 1,382.80  వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 1,374.55 ముగిసిన ఈ షేరు, శుక్రవారం సెషన్‌లో రూ. 1,378.90 వద్ద ప్రారంభమై, రూ. 1,389.95 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఇతర డైమండ్‌, ఆభరణాల షేర్లయిన ఆట్లాస్‌ జ్యువెలరీ, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్సు 2 శాతం మేర లాభపడ్డాయి. కానీ తంగమైల్‌ జ్యువెలరీ, పీసీ జ్యువెలరీ, ట్రిభోవనందస్‌ భిమిజి జవేరి, ఉదయ్‌ జ్యువెలరీ ఇండస్ట్రీస్‌ షేర్లు 5 శాతం మేర పతనమయ్యాయి.
   హిందు సాంప్రదాయం ప్రకారం ఐదు రోజుల దిపావళి పండుగ ‘ధన్‌తేరాస్’ పం‍డుగతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ధన్‌తేరాస్‌ అక్టోబర్‌ 25 న వచ్చింది. కాగా దిపావళి పండుగ సమయంలో బంగారం, ఇతర విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడం హిందు సాంప్రదాయంగా ఉంది. ఫలితంగా బంగారం ధరలు పెరగడం చూస్తున్నాం. 



You may be interested

ఫలితాల ప్రభావం: ఇండిగో షేరు క్రాష్‌ల్యాండింగ్‌

Friday 25th October 2019

ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరాశపరచడంతో శుక్రవారం ఇండిగో షేర్లు కుప్పకూలాయి. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ఈ ఆర్థిక సంవత్సరపు క్యూ2(జులై-సెప్టెంబర్‌)లను విడుదల చేసింది. క్యూ2లో రూ. 1062 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది గతేడాది క్యూ2లో రూ. 652 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 31 శాతం ఎగసి రూ. 8105

సుప్రీం తీర్పుతో కొత్త కనిష్ఠానికి వోడాఫోన్‌ఐడియా

Friday 25th October 2019

  లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలివ్వడంతో గురువారం సెషన్‌లో 27 శాతం పతనమయిన వొడాఫోన్‌ ఐడియా షేరు, శుక్రవారం ట్రేడింగ్‌లో కూడా మరో 10 శాతం నష్టపోయి రూ. 3.65 వద్ద కొత్త జీవిత కాల కనిష్ఠాన్ని తాకింది. వోడాఫోన్‌-ఐడియా షేరు ఉదయం 10.54 సమయానికి 8.05 శాతం నష్టపోయి రూ. 4.00 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 27 శాతం పడిపోయి రూ. 4.35 వద్ద

Most from this category