News


రెండు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై బుల్లిష్‌

Tuesday 4th June 2019
Markets_main1559671752.png-26095

ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, కేఆర్‌ చోక్సే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దేవేన్‌ చోక్సే హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. అలాగే, ఆటోమొబైల్ రంగంలో అశోక్‌ లేలాండ్‌, టాటా మోటార్స్‌ కంపెనీల ప్రతికూలతలు వాటి ధరలపై పూర్తిగా ప్రభావం చూపించాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

ఇటీవలే ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి సంబంధించి ప్రకటించిన కఠిన మార్గదర్శకాలపై దేవేన్‌ చోక్సే స్పందిస్తూ... నాణ్యమైన ఎన్‌బీఎఫ్‌సీలు రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా, వివేకంతో రుణాలను మంజూరు చేస్తుంటాయన్నారు. అటువంటి సందర్భాల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి ఎన్‌బీఎఫ్‌సీలు తప్పకుండా సానుకూల జాబితాలో ఉంటాయన్నారు. ఈ షేరు వ్యాల్యూషన్లు చాలా ఖరీదుగా ఉన్నప్పటికీ, రుణాలను వివేకంగా పంపిణీ చేయడంలో ఈ సంస్థ తనను తాను నిరూపించుకున్నట్టు చెప్పారు. కనుక ఈ సంస్థ మెరుగైన స్థానంలో ఉంటుందన్నారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌లో భాగమైన బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తప్పకుండా తమ స్టాక్స్‌ జాబితాలో ఉంటాయని చెప్పారు. ఇవి వార్షికంగా 20-25 శాతం వృద్ధిని నమోదు చేయగలవన్నారు. 

 

ఆర్‌బీఐ 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని మార్కెట్లు ఇప్పటికే పరిగణనలోకి తీసేసుకున్నాయని దేవేన్‌ చోక్సే పేర్కొన్నారు. అయితే, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, బాండ్‌ మార్కెట్‌ తీరును పరిశీలిస్తే మరింత ఎక్కువ రేటు కోత ఉంటుందని అనిపిస్తోందన్నారు. అయితే, రేట్ల తగ్గింపుకంటే దాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయడమే మఖ్యమని అభిప్రాయపడ్డారు. నెస్లే, బ్రిటానియా వాటి గరిష్ట ధరలకు సమీపంలో ఉండడంపై మాట్లాడుతూ... ఈ కంపెనీలను కొనుగోలు చేసుకోవచ్చని, వినియోగదారుల మనసుల్లో ఇవి తమ బ్రాండ్లతో బలమైన ముద్ర వేశాయన్నారు. కంపెనీ సైజు, వాటి పంపిణీ నెట్‌వర్క్‌ పరిధిని చూసినా, పోటీలో ఇవి బలంగా ఉంటాయని తెలుస్తోందన్నారు. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో 12-15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది ప్రీమియంను చెల్లించాల్సి వస్తే, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల విషయంలో మాత్రం రెండు నుంచి మూడేళ్ల భవిష్యత్తు పీఈ ఆధారంగా ముందే ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుందన్నారు. తగినంత కరెక్షన్‌ వస్తే ఎఫ్‌ఎంసీజీలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చన్నారు.  

 

ఆర్‌బీఐ రేట్ల కోత వ్యవస్థలో బదిలీ జరిగితే ఆటోమొబైల్‌ రంగలో డిమాండ్‌ తిరిగి పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని చోక్సే వ్యక్తం చేశారు. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల కంపెనీల పట్ల తాను బుల్లిష్‌గా ఉన్నట్టు ఆయన చెప్పారు. పాత వాహనాలను తుక్కువగా మార్చే విధానంతో వీటికి డిమాండ్‌ ఇంకా పెరుగుతుందన్నారు. కొనుగోళ్లకు ఇది అనువైన సమయమని, టాటా మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌ షేర్లలో ఇప్పటికే ప్రతికూలతలన్నీ ప్రభావం చూపించేశాయన్నారు. కనీసం ఏడాదిన్నర, రెండేళ్లపాటు పెట్టుబడులు కొనసాగించేవారికి టాటా మోటార్స్‌, అశోక్‌లేలాండ్‌ మంచి బెట్స్‌ అవుతాయన్నారు.You may be interested

ఇంటి కోసం ఐదడుగులు...

Tuesday 4th June 2019

సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాలలో భాగంగా ఉంటుంది. సంపాదన ఆరంభించిన తర్వాత నుంచి దీనిపై కలలు కనే వారు ఎందరో. ఫలానా సమయానికి సొంతిల్లును సమకూర్చుకోవాలన్న ప్రణాళికతోనూ ఉంటారు కొందరు. అయితే, ఇంటి సంబంధించిన ఆలోచనలు చేస్తు‍న్న వారు తప్పకుండా ఓ ఐదు అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.   చెల్లించేంతే... రుణం తీసుకుని ఇల్లు సమకూర్చుకోవడం అన్నది అతిపెద్ద ఆర్థిక నిర్ణయం అవుతుంది. అందుకే మీరు ఎంత అయితే ఈఎంఐ రూపంలో

రెరా, జీఎస్‌టీలతో పారదర్శకత

Tuesday 4th June 2019

– రెండేళ్లలో 41వేల ప్రాజెక్టుల నమోదు – అత్యధికంగా మహారాష్ట్రలో 20,560 – ఏపీలో ఇప్పటిదాకా 40 ప్రాజెక్టులే – నమోదైనవయితేనే బెటర్‌: చిన్నం మధుబాబు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో స్థిరాస్తి  లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతోందనే చెప్పాలి. రెరా చట్టం దేశంలో అమల్లోకి వచ్చి ఇప్పటికి రెండేళ్లు పూర్తవుతోంది. ఇప్పటివరకూ 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెరా నిబంధనలను నోటిఫై చేయగా...

Most from this category