News


నిరాశపరిచిన గైడెన్స్‌: ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 14.50శాతం క్రాష్‌

Friday 19th July 2019
Markets_main1563530189.png-27187

తొలి తైమాసిక ఫలితాలను ఆశించిన స్థాయిలో నమోదు చేసినప్పటికీ.., వచ్చే 2-3 త్రైమాసికాల్లో వృద్ధి బలహీనంగా వుండవచ్చంటూ  ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ఆర్‌బీఎల్‌ యాజమాన్యం హెచ్చరించడంతో ఆ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 14.50శాతం క్షీణించింది. ఈ ఏడాది పనితీరుపై తాజా అంచనాలు(గైడెన్స్‌) నిరాశపరచడంతో షేరు పతనానికి కారణమైంది. నేడు బ్యాంకు మొదటి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ1లో రూ.267 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఇదే త్రైమాసిక కాలంలో ప్రకటించిన రూ.190 కోట్లతో పోలిస్తే ఇది 41శాతం అధికం. గత క్యూ1 కాలంతో పోలిస్తే నికర వడ్డీ మార్జిన్లు 48శాతం, ఇతర ఆదాయం, 48శాతం, నిర్వహణ లాభం 43శాతం వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రొవిజన్లకు రూ.140.35 కోట్ల కేటాయింపు జరగ్గా, ఈ క్యూ1 నాటికి కేటాయింపులు 52శాతానికి పెరిగి రూ. 213.18 కోట్లగా నమోదయ్యాయి. ఫలితాలపై బ్యాంకు ఎండీ&సీఈవో విశ్వవీర్‌ అహుజా స్పందిస్తూ ‘‘క్యూ1లో బ్యాంకు మంచి ఫలితాలను సాధించింది. వృద్ధి వేగం కొనసాగింది. పనితీరు మరింత మెరుగైంది. అని తెలిపారు. 
గైడెన్స్‌ వీక్‌:- 
ప్రస్తుతం వ్యవస్థలో ద్రవ్య కొరత, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ అస్థిరత కారణంగా కొన్ని కార్పొరేట్‌ ఖాతాలు సమస్యాత్మకంగా పరిణమించాయని, దీంతో రానున్న కాలంలో అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి వస్తోందని, రాబోయే 2-3 త్రైమాసికాలలో బ్యాంక్ వృద్ధి కొంతమేర క్షీణించే అవకాశం ఉందని, అయితే సవాళ్లను ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్యాంకు ఎండీ అహుజా  మీడియా సమావేశంలో తెలిపారు. 
14.50శాతం పతనం:- 
నేడు షేరు రూ.580.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఏడాది పనితీరుపై తాజా అంచనాలు(గైడెన్స్‌) నిరాశపరచడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 14.50శాతం క్షీణించి రూ.496.70ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:10ని.లకు షేరు గతముగింపు ధరతో పోలిస్తే 13.50శాతం నష్టపోయి రూ.501.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 438.80  రూ.716.55లుగా నమోదయ్యాయి.You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలు ఎలా ఉంటాయి?

Friday 19th July 2019

మార్కెట్‌ వాల్యూషన్‌ పరంగా దేశంలో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ జూన్‌ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించనుంది. ఈ దఫా కూడా ఎప్పటిలాగే బ్యాంకు మంచి ఫలితాలు ప్రకటించవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  - ప్రభుదాస్‌ లీలాధర్‌: గతేడాది క్యు1తో పోలిస్తే బ్యాంకు లాభంలో 27.50 శాతం, నికర వడ్డీ ఆదాయంలో 23.40 శాతం పెరుగుదల ఉండొచ్చు. ప్రీప్రొవిజనింగ్‌ కార్యనిర్వాహక లాభంలో కూడా 25.20 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎప్పుడూ బ్యాంకు

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Friday 19th July 2019

దేశియ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బెంచ్‌మార్కు సూచీలు బారీగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.51 సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌ 163.15 పాయింట్లు కోల్పోయి 11,433.75 పాయింట్లు వద్ద, 498.20 పాయింట్లు కోల్పోయి 38,399.26 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్లు ఇంత బారీ స్థాయిలో నష్టపోవడానికి.. కారణమయిన ఐదు కారకాలు ‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జీలపై ఆర్థిక మంత్రి ప్రకటన : ‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జ్‌ నుంచి మినహాయింపు కావాలంటే ఎప్‌పీఐ(విదేశి పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు)లు తమను

Most from this category