News


ఎయిర్‌టెల్‌ మరో 4 శాతం జంప్‌

Monday 5th August 2019
Markets_main1565000539.png-27552

మార్కెట్లు నిలువునా పతనమవుతన్నా....ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 ఫలితాలను ప్రకటించిన తర్వాత నుంచి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఎయిర్‌టెల్‌ సోమవారం ట్రేడింగ్‌లో 4.53 శాతం లాభపడి రూ. 359.10 వద్ద ముగిసింది. కాగా మార్కెట్లు తీవ్రంగా నష్టపోయినప్పటికి ఎయిర్‌టెల్‌ మాత్రం లాభపడి ముగియడం గమనార్హం. గత సెషన్‌లో కూడా ఈ కంపెనీ షేరు 6 శాతం లాభపడి రూ. 343.55 వద్ద క్లోజయ్యింది.  మొత్తంగా ఈ రెండు సెషన్‌లను(ఈ రోజు, శుక్రవారం) కలిపి 10 శాతానికి పైనే లాభపడింది. ఈ రోజు రూ. 340.10 వద్ద ఈ షేరు ప్రారంభమయ్యి, రూ. 339.05 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని, రూ. 361.65 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ 50 సోమవారం ట్రేడింగ్‌లో 134.75 పాయింట్లు నష్టపోయి 10,862.60 పాయింట్ల వద్ద ముగిసింది.



You may be interested

ఇటు కశ్మీర్‌...అటు చైనా..కుప్పకూలిన స్టాక్‌ సూచీలు

Monday 5th August 2019

418 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌  135 పాయింట్లు నష్టపోయి నిఫ్టీ  జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణతో పాటు 35(ఎ) అధికరణ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో పాటు అమెరికా-చైనాల మధ్య ఉధృతమవుతున్న వాణిజ్యయుద్ధ ప్రభావంతో  ప్రపంచ మార్కెట్లు నిలువునా పతనమైన నేపథ్యంలో భారత మార్కెట్‌ సోమవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 418 పాయింట్లను కోల్పోయి 37000 దిగువను 36,699.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి

ఏడాదిన్నర కనిష్టానికి ఐటీసీ

Monday 5th August 2019

ఐటీసీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ సెషన్స్‌లో ఏడాదిన్నర కనిష్టానికి పతనమయ్యాయి. తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేపోవడం,  బ్రోకరేజ్‌ సంస్థలు ఐటీసీ షేర్లపై కొనుగోళ్ల టార్గెట్‌ ధరను తగ్గించడం ఇందుకు కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.265.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒకదశలో షేరు రూ.2.50శాతం నష్టపోయి రూ.257.60ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Most from this category