News


నిఫ్టీలో కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 23rd December 2019
Markets_main1577098475.png-30387

శుభమ్‌ అగర్వాల్‌
నిఫ్టీలో ప్రస్తుతం కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం మంచిదని ప్రముఖ అనలిస్టు శుభమ్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ వ్యూహం నాలుగంచెలుగా ఉంటుంది. ఇందులో ప్రస్తుత స్థాయికి దగ్గర్లోని కాల్‌ను ఒకలాట్‌ కొంటారు. అనంతరం దానికి పైన అధిక స్థాయికి చెందిన కాల్‌ రెండు లాట్లు అమ్మాలి. అనంతరం అమ్మిన కాల్‌కు దగ్గర్లోని ఒక కాల్‌ లాట్‌ ఒకటి కొనడం జరుగుతుంది. ఈ వ్యూహంలో లాభాలు స్వల్పమైనా స్థిరంగా ఉంటాయి, రిస్కు తక్కువ వ్యూహమని అగర్వాల్‌ చెప్పారు. 
వ్యూహం:
టార్గెట్‌ స్థాయి: 12,450. 
బ్రేక్‌ఈవెన్‌ పాయింట్‌: 12369.
రిస్కురివార్డు నిష్పత్తి: 4.3:1.
కాలపరిమితి: నాలుగు రోజులు.
కొనాల్సింది: 12350, 12500 కాల్‌ లాట్స్‌ను కొనాలి.
అమ్మాల్సింది: 12450 కాల్‌ రెండు లాట్స్‌ విక్రయించాలి.
పొజిషన్‌ గీక్స్‌: డెల్టా 11, తీటా- 68, వేగా 93, గామా-04. 



You may be interested

2020లో మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు..

Tuesday 24th December 2019

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. 2019 కంటే 2020లో మార్కెట్‌ మెరుగ్గా ఉండాలన్న ఆకాంక్ష ఇన్వెస్టర్లు అందరిలోనూ ఉంటుంది. కానీ, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. గడిచిన ఏడాది కాలంలో మనం చూసిన ఎన్నో అంశాల్లో కొన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగొచ్చని ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో భవేష్‌ సంఘ్వి అంచనా వేస్తున్నారు. 2020లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలను ఆయన వెల్లడించారు.   అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల

ఒడిదుడుకుల మధ్య చివరికి నష్ఠాలు

Monday 23rd December 2019

పీఎస్‌యూ బ్యాంక్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ వీక్‌ మీడియా, ఆటో రంగాలు ప్లస్‌ గత వారం సరికొత్త రికార్డులతో దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఆద్యంతం​ఒడిదుడుకులను చవిచూశాయి. చివరికి స్వల్ప వెనకడుగుతో ముగిశాయి. సెన్సెక్స్‌ 39 పాయింట్లు క్షీణించి 41,643 వద్ద నిలవగా.. నిఫ్టీ 9 పాయింట్లు నీరసించి 12,2663 వద్ద స్థిరపడింది. గత వారం ర్యాలీ జరిగిందున, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా

Most from this category