ఈ టైంలో లాంగ్పుట్ బటర్‌ఫ్లై స్ప్రెడ్ వ్యూహం బెటర్!
By D Sayee Pramodh

నిపుణుల సలహా
నిఫ్టీ కీలక 11460 పాయింట్ల నిరోధాన్ని కోల్పోయింది. దీంతో నిఫ్టీ క్రమంగా 11300 పాయింట్ల వరకు పతనమవుతుందని, ఈ స్థాయిని కాపాడుకోలేకుంటే క్రమంగా 11200 పాయింట్లను కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పైకి 11500 పాయింట్లకు వచ్చినప్పుడు అమ్మకాల ఒత్తిడి పెరగనుంది. తాజా బ్రేక్‌డౌన్‌తో నిఫ్టీపై బుల్స్ పట్టు జారినట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో బేరిష్ లాంగ్పుట్ బటర్‌ఫ్లై వ్యూహాన్ని అవలంబించడం మంచిదని సూచిస్తున్నారు.
ఇది ఒక రేంజ్బౌండ్ వ్యూహం. ఈ వ్యూహంలో నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌లో తాకుతుదని భావించే స్ట్రైక్‌ప్రైస్ వద్ద పుట్స్ రెండిటిని విక్రయించి, ఆ స్ట్రైక్ప్రైస్కు అటు ఇటు పుట్స్‌ను కొనుగోలు చేయడం జరుగుతుంది. వీక్లీ ఆప్షన్స్ కారణంగా టైమ్ డికే(సమయ క్షీణత) వేగంగా ఉంటుంది, అందువల్ల ఈ వ్యూహం సత్ఫలితాలు ఇస్తుంది. మనం విక్రయించిన స్ట్రైక్ప్రైస్కు అటుఇటుగా సూచీ క్లోజయితే మంచి లాభం వస్తుంది.
You may be interested
ఒడిదుడుకుల వారం..!
Monday 22nd July 2019గురువారం జూలై సిరీస్ ఎఫ్ అండ్ ఓ ముగింపు మారుతి సుజుకి, ఎల్ అండ్ టీ, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈవారంలోనే.. నెమ్మదించిన వినియోగం, పేలవమైన ఫలితాలు, పన్ను అంశాలతో దెబ్బతిన్న సెంటిమెంట్ ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో గతవారం నష్టాలను నమోదుచేసిన దేశీ స్టాక్ సూచీలు.. ఈవారంలో భారీ ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడే ఆస్కారం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన పలు దిగ్గజ కంపెనీల మొదటి
పసిడి ధరకు ఫెడ్ అండ..!
Monday 22nd July 2019ఫెడ్‌రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్ల కోత అంచనాలతో పసిడి ధర సోమవారం స్వల్పంగా లాభపడింది. నేడు ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 2డాలర్ల లాభంతో 1,428.65డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో డాలర్ అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవుతోందని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించడటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వడ్డీరేట్ల కోతకు పిలుపునివ్వడంతో పాటు ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్ పసిడి ధరకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా ఒకదశలో 3డాలర్లు పెరిగి 1,429.50డాలర్ల