News


ఈ వారానికి బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటర్‌!

Monday 19th August 2019
Markets_main1566194253.png-27856

నిపుణుల సలహా
నిఫ్టీ ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 10900- 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ బాగా పోగుపడినట్లు కనిపిస్తోంది. 11100, 11400 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11000 పాయింట్ల వద్ద మద్దతు ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దగ్గర్లో గట్టి నిరోధం ఏమీ లేదని, అందువల్ల క్రమంగా 11200 నుంచి 11500 పాయింట్ల వరకు నిఫ్టీ ఎగబాకవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యాంకు నిఫ్టీలో సైతం పుట్‌ రైటింగ్‌ పెరగడం గమనించవచ్చు. 29000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నందున ఈ స్థాయి వరకు బ్యాంకు నిఫ్టీ పెరగవచ్చని అంచనా. మరోవైపు నిఫ్టీ పీసీఆర్‌(పుట్‌కాల్‌ రేషియో) 1.21 వద్ద ఉంది. మార్కెట్లు దిగువ మద్దతు స్థాయిల నుంచి పైకి వచ్చి కన్సాలిడేట్‌ కావడం గమనిస్తే నిరాశావాతవరణం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. పీసీఆర్‌ 1 కన్నా దిగువకు వస్తే మరోమారు బేరిష్‌నెస్‌ పెరుగుతుంది. ఇప్పటికైతే షార్ట్‌కవరింగ్‌ కారణంగా 11300 వరకన్నా నిఫ్టీ ర్యాలీ జరపడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణుల విశ్లేషణ. అందువల్ల ఈ స్థాయిల్లో తక్కువ రిస్కు ఉండే బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించాలని సూచిస్తున్నారు. బౌన్స్‌ బ్యాక్‌ను అంచనా వేస్తున్న తరుణంలో ఈ వ్యూహం అవలంబిస్తారు. ఇందులో తక్కువ స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద ఒక కాల్‌ కొని, పైస్థాయిల్లో ఒక కాల్‌ను అమ్మడం జరుగుతుంది. 
నిఫ్టీ ఆప్షన్స్‌లో ఈ వ్యూహాన్ని ఇలా అవలంబించాలి...


 



You may be interested

రూ.2,500 కోట్లు రికవరీ:బీవోఐ

Monday 19th August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు రికవరీ అయ్యే అవకాశం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భావిస్తోంది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ వద్ద 8-10 ఎన్‌పీఏ కేసులు పరిష్కారం కావొచ్చని బ్యాంకు ఈడీ సి.జి.చైతన్య తెలిపారు. తెలంగాణ జోనల్‌ మేనేజర్‌ ఎల్‌.మురళీ కృష్ణ రాజు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ సి.శోభారాణితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులు పరిష్కారం అవడం వల్ల లాభాలకు

ఐడియాలపై ప్రభుత్వరంగ బ్యాంకుల సమావేశాలు

Monday 19th August 2019

ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకుల నిర్వహణ న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు తమ శాఖల స్థాయిల్లో అధికారులతో తొలి విడత సమాలోచనలు నిర్వహించాయి. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) స్థాయికి తీసుకెళ్లేందుకు గాను, బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత పటిష్ట పరచాలని, భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ ఓ నెల రోజుల

Most from this category