STOCKS

News


బ్యాంకు నిఫ్టీలో బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం!

Monday 27th January 2020
Markets_main1580114888.png-31236

గతవారం బ్యాంకు నిఫ్టీలో గణనీయంగా షార్ట్స్‌ పెరిగాయి. దీంతో ఫ్యూచర్స్‌ ఓఐ సుమారు 20 శాతం పెరిగింది. దీంతో స్వల్పకాలానికి బ్యాంకు నిఫ్టీలో వెనుకంజకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు నిఫ్టీలో బేర్‌ పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని సూచిస్తున్నారు. ఇది ఒక బేరిష్‌ వ్యూహం. ఇందులో ప్రస్తుత మార్కెట్‌ధరకు సమీప పుట్‌ను కొనుగోలు చేయడం, అంతకన్నా దిగువ పుట్‌నువిక్రయించడం చేస్తారు. వ్యూహంలో లాభం పరిమితంగా ఉంటాయి.
వ్యూహం..
గతవారం ముగింపు ధరల ఆధారంగా ఈ సూత్రం వివరించడం జరుగుతోంది. సోమవారం ధరలకు తగ్గట్లు స్ట్రైక్‌ ప్రైస్‌ను అడ్జస్ట్‌ చేసుకొని వ్యూహాన్ని అవలంబించాలి. 31000 స్ట్రైక్‌ ప్రైస్‌ పుట్‌ ఒకలాట్‌(20 షేర్లు) కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో 30500 పుట్‌ ఒక లాట్‌ను విక్రయిస్తారు. స్టాప్‌లాస్‌ 79 పాయింట్లు. టార్గెట్‌ 421 పాయింట్లు(దిగువకు). కాల పరిమితి 4 రోజులు. రిస్కురివార్డు- 5.3:1. బ్రేక్‌ ఈవెన్‌ పాయింటు 30921.



You may be interested

విశాకా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ అప్‌- జేఎస్‌డబ్ల్యూ వీక్‌

Monday 27th January 2020

ప్రపంచ ఇన్వెస్టర్లలో తలెత్తిన కరోనా వైరస్‌ భయాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 240 పాయింట్లు క్షీణించి 41,373కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్ల వెనకడుగుతో 12,172 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా విశాకా ఇండస్ట్రీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో

డాక్టర్‌ రెడ్డీస్‌ క్యూ3 నష్టం రూ. 570 కోట్లు

Monday 27th January 2020

ఇంపెయిర్‌మెంట్‌ చార్జీల ఎఫెక్ట్‌ 52 వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఫార్మా రంగ హైదరాబాద్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాక్టర్‌ రెడ్డీస్‌ రూ. 570 కోట్లమేర నికర నష్టం నమోదు చేసింది. గతేడాది అంటే 2018-19 క్యూ3లో రూ. 485 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం

Most from this category