News


ఐపీవో ఇష్యూ ధరపై భారీ లాభాలు!

Monday 11th November 2019
Markets_main1573412211.png-29479

మంచి వ్యాపారాలతో కూడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్నింటి వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నా కానీ, వారు వెనుకాడడం లేదు. భవిష్యత్తు వృద్ధి అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ముగిసిన ఐపీవోలను పరిశీలిస్తే కొన్ని ఇష్యూ ధర నుంచి ఇప్పటి వరకు మంచి లాభాలనే ఇచ్చాయి. 

 

ఈ ఏడాది ఐపీవో ఇష్యూల్లో కొన్ని మంచి సక్సెస్‌ సాధించాయి. 10 కంపెనీలు వాటి ఇష్యూ ధరపై లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. వీటిల్లో అత్యధిక రాబడులను ఇచ్చింది మాత్రం ఐఆర్‌సీటీసీ ఇష్యూనే. ఒక్కో షేరును రూ.320కి జారీ చేయగా, ప్రస్తుతం రూ.880 స్థాయిల్లో ట్రేడవుతోంది. అంటే 175 శాతం లాభపడినట్టు. రైల్వే టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌, రైళ్లు, రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్‌ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీకే ఉండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ధరలోనూ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ‘‘ఈ కంపెనీలు సమీకరించిన నిధుల మొత్తం చిన్నదే. ఇవన్నీ వినూత్న వ్యాపారాలను కలిగినవి’’అని టార్గెట్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌కల్రా పేర్కొన్నారు. 

 

హిట్‌ అయిన ఐపీవోలు


కంపెనీ                    ఇష్యూధర(రూ.)    ఇప్పటికి పెరిగిన శాతం
ఐఆర్‌సీటీసీ              320                   175
యాఫ్లే ఇండియా       745                    84
ఇండియామార్ట్‌         973                    78
నియోజెన్‌ కెమికల్స్‌   215                   76
మెట్రోపొలిస్‌              880                   60
పాలీక్యాబ్‌ఇండియా    538                    59
స్పందనస్ఫూర్తి         856                    53
ఆర్‌వీఎన్‌ఎల్‌              19                    25
చాలెట్‌హోటల్స్‌         280                    18You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మీ పథకాల పనితీరు?

Monday 11th November 2019

ఒక పక్క ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ప్రతికూలంగా ఉన్న మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లోనూ రికవరీ కనిపిస్తోంది. కొన్ని ‍స్టాక్స్‌ ఇప్పటికే 30 శాతం వరకు కనిష్టాల నుంచి పెరిగాయి. అంతెందుకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 10 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 8 శాతం మేర గత రెండు నెలల్లో పెరిగాయి.    మిడ్‌క్యాప్‌ విభాగం 2018 సంవత్సరంలో 12 శాతం నష్టాలను మిగిల్చింది. కానీ, ఈ ఏడాది

అయోధ్య తీర్పు మార్కెట్లకు సానుకూలం: విశ్లేషకులు

Saturday 9th November 2019

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనీవారం తీర్పిచ్చింది. వివాదంలో ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని తేల్చింది. కాగా సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల

Most from this category