News


పడినప్పుడల్లా కొనుగోళ్లు: మోతీలాల్‌ ఓస్వాల్‌

Wednesday 29th May 2019
Markets_main1559069251.png-25968

నిఫ్టీ హ్యాంగింగ్‌ మ్యాన్‌ క్యాండిల్‌ను రోజువారీ స్కేల్‌పై నమోదు చేసిందని, అదే సమయంలో గరిష్ట కనిష్టాలను గడిచిన మూడు రోజులుగా నమోదు చేస్తూ వస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ టెక్నికల్‌, డెరివేటివ్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా పేర్కొన్నారు. మంగళవారం సెషనల్‌లో నిఫ్టీ ఎక్కువ సమయం పాటు స్థిరీకరణ విధానంలో కొనసాగిందన్నారు. దిగువ స్థాయిల్లో కొనుగోళ్లతో సూచీ తిరిగి 11,900 స్థాయిని చివరి గంటలో అధిగమించినట్టు చెప్పారు. అయితే, నిఫ్టీ 12,000, 12,040 స్థాయిల వరకూ వెళ్లాలంటే 11,850పైన కొనసాగాల్సి ఉటుందన్నారు. నిఫ్టీకి 11,761 మద్దతు స్థాయిగా పేర్కొన్నారు.

 

ఆప్షన్ల విషయానికొస్తే... పుట్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 11,000, ఆ తర్వాత 11,700 స్ట్రయిక్‌ వద్ద ఎక్కువగా నమోదైందని, కాల్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 12,500, ఆ తర్వాత 12,000 స్ట్రయిక్‌ వద్ద ఎక్కువగా ఉన్నట్టు చందన్‌ తపారియా పేర్కొన్నారు. పుట్‌ రైటింగ్‌ 11,900 స్థాయిలో, ఆ తర్వాత 11,750 వద్ద ఎక్కువగా జరిగిందని, కొద్దిపాటి కాల్‌ రైటింగ్‌ 11,900, 12,000 స్ట్రయిక్‌ల వద్ద జరిగినట్టు చెప్పారు. ఆప్షన్‌ బ్యాండ్‌ను బట్టి నిఫ్టీ ట్రేడింగ్‌ పరిధి 11,700-12,100 స్థాయిలో ఉంటుందన్నారు. ఇండియా వీఐఎక్స్‌ (అస్థిరత సూచీ) 1.65 శాతం తగ్గి 15.92 స్థాయికి చేరిందని, ఈ పతనం స్వల్ప కాలంలో స్థిరత్వాన్ని సూచిస్తు‍న్నట్టు విశ్లేషించారు. అలాగే, అధిక బేస్‌ కూడా నమోదైనట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు మార్కెట్లు పడినప్పుడల్లా కొనుగోలు చేసే విధానాన్ని అనుసరించొచ్చని సూచించారు. 

 

‘‘నిఫ్టీ బ్యాంకు సానుకూలంగా ప్రారంభమై నూతన జీవితకాల గరిష్ట స్థాయి 31,712 వరకు వెళ్లినప్పటికీ అక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమైంది. అలాగే, సెషన్‌ అంతటా అస్థిరతంగా చలించింది. అయితే, గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో గరిష్టంలో కనిష్టాలను నమోదు చేస్తోంది. అలాగే, కనిష్ట స్థాయిల నుంచి రివకరీ అయి రోజువారీ స్కేల్‌పై హ్యాంగింగ్‌ మ్యాన్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడిక నిఫ్టీ బ్యాంకు 31,313పైన నిలబడితే 32,000, 32,250 స్థాయిల వరకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రధాన మద్ధతు స్థాయిలు 31,000, 30,500’’అని తపారియా వివరించారు. You may be interested

ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఎన్‌బీఎఫ్‌సీ లాభాలకు దెబ్బ!

Wednesday 29th May 2019

బ్యాంకింగేత ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) సంబంధించి ఆర్‌బీఐ తాజాగా తీసుకొచ్చిన ముసాయిదా మార్గదర్శకాలు వాటి లాభాల మార్జిన్లను క్షీణించేలా చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య బ్యాంకుల తరహాలో ఎన్‌బీఎఫ్‌సీలకూ లిక్విడిటీ పరంగా కఠిన మార్గదర్శకాలను ఆర్‌బీఐ ప్రతిపాదించిన విషయం విదితమే. గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు రుణ చెల్లింపుల్లో విఫలమైన తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత (లిక్విడిటీ) పరంగా కఠిన పరిస్థితులను ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో విడతలవారీగా

మూడోరోజూ రికార్డు ముగింపే

Tuesday 28th May 2019

రాణించిన ఐటీ, మీడియా రంగ షేర్లు  ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఉగిసలాడిన సూచీలు చివరి గంటలో ఐటీ షేర్ల అండతో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 66.44 పాయింట్లు లాభపడి 39,749.73 వద్ద, నిఫ్టీ 16.40 పాయింట్లు పెరిగి 11,941.20 వద్ద స్ధిరపడ్డాయి. సూచీలకు ఇది వరుసగా మూడోరోజూ గరిష్టస్థాయి వద్ద ముగింపు కావడం విశేషం. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడటం పాటు, ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ ర్యాలీ కారణంగా ఐటీ

Most from this category