News


ఇన్వెస్టర్లపై డివిడెండ్‌ ట్యాక్స్‌ భారం

Sunday 2nd February 2020
Markets_main1580617160.png-31422

న్యూఢిల్లీ: కంపెనీలపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ) భారం తొలగనున్నది. డీడీటీని కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమని, ఈ నిర్ణయం కారణంగా పెట్టుబడులకు ఆకర్షణీయంగా భారత్‌ అవతరిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. కంపెనీలపై డీడీటీని తొలగించడం కారణంగా ఏడాదికి రూ.25,000 కోట్ల ఆదాయం కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించే డివిడెండ్లపై 15 శాతం మేర పన్ను చెల్లిస్తున్నాయి. దీనికి సర్‌చార్జీ, సెస్సు అదనం. తాజా ప్రతిపాదన ప్రకారం, ఇన్వెస్టర్లు తాము పొందే డివిడెండ్లపై తమకు వర్తించే ఆదాయపు పన్ను రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అనుబంధ కంపెనీ నుంచి హోల్డింగ్‌ కంపెనీ స్వీకరించే డివిడెండ్‌ను మినహాయించే ప్రతిపాదన కూడా ఉంది. 



You may be interested

టెలికం నుంచి రూ. 1.33 లక్షల కోట్ల వసూళ్లు

Sunday 2nd February 2020

2020-21 బడ్జెట్‌లో అంచనా న్యూఢిల్లీ: స్పెక్ట్రం యూసేజి చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయీలు రూపంలో టెలికం రంగం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1.33 లక్షల కోట్ల మేర రాగలవని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి కమ్యూనికేషన్స్ విభాగం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 58,687 కోట్లు రావొచ్చని బడ్జెట్‌లో పేర్కొంది. వాస్తవానికి ఇది రూ. 50,520 కోట్ల స్థాయిలో ఉండొచ్చని 2019-20 బడ్జెట్‌లో కేంద్రం అంచనా

మార్కెట్‌లో ఎందుకీ భారీ పతనం

Sunday 2nd February 2020

- మెప్పించని డీడీటీ ప్రతిపాదన - ఎల్‌టీసీజీ పన్ను తొలగించకపోవడంపై నిరాశ - ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాల సాధనపై సందేహాలు జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్‌ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్‌...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్‌ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్‌. నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్‌ పన్నును

Most from this category