News


డీసీబీ బ్యాంక్‌ షేర్లకు క్యూ1 ఫలితాల షాక్‌

Wednesday 17th July 2019
Markets_main1563356463.png-27129

  • 18శాతం క్షీణించిన షేరు ధర

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో డీసీబీ బ్యాంకు షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో భారీ స్థాయిలో క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.222.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రుణ వృద్ధి భారీ క్షీణించటంతో పాటు తాజాగా స్లిపేజ్‌ పెరగడం, ఎన్‌పీఏలు పెరగడం తదితర కారణలతో బ్యాంకు ఆశించిన ఫలితాలను నమోదు చేయలేకపోయింది. ‘‘తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.81.1 కోట్లుగా నమోదైంది. ఇది మా అంచనాలకు దిగువను నమోదైంది. రీటైల్‌ టర్మ్‌ డిపాజిట్లు సమీకరణపై ఎక్కువగా దృష్టిసారించడంతో పాటు గత ఆర్థిక సంవత్సరం మధ్యలో ధీర్ఘకాలిక రుణాలకు అధిక వ్యయాన్ని కేటాయించడంతో బ్యాంకు ఎన్‌ఐఎం(నికర వడ్డీ ఆదాయం క్వార్టర్‌ టు క్వార్టర్‌ 11బేసిస్‌ పాయింట్లు క్షీణించాయి’’ అన్ని జేఎం సెక్యూరిటీస్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ సెక్యూరిటీ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. మరో రెండు క్వార్టర్ల పాటు కంపెనీ మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కోంటుందని ప్రకటించిన నేపథ్యంలో బ్రోకరేజ్ సంస్థ డీసీబీ బ్యాంకు షేర్లకు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను కేటాయించడంతో టార్గెట్‌ ధర రూ.230లకు సవరించింది. క్వార్టర్‌ ఫలితాలను అందుకోలేకపోవడంతో పాటు బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ ధరను తగ్గించడంతో డీసీబీ షేరు మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఒకదశలో దాదాపు 18శాతం క్షీణించి రూ.196.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.238.8)తో పోలిస్తే 16శాతం క్షీణించి రూ.201.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.139.50  రూ.244.60లుగా నమోదయ్యాయి. 



You may be interested

తిరిగి రికార్డుస్థాయికి ఎస్‌బీఐ

Wednesday 17th July 2019

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో తిరిగి జీవితకాల గరిష్టానికి చేరాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.364.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 2.50 లాభపడి రూ.373.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇది జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. కొద్దిరోజుల క్రితం  ఇదేస్థాయికి చేరిన తర్వాత స్వల్ప కరెక‌్షన్‌కు లోనైన

ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు కొనొచ్చా?

Wednesday 17th July 2019

తాజాగా క్యు1 ఫలితాలు ప్రకటించిన ఫెడరల్‌ బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. క్యు1లో బ్యాంకు లాభం దాదాపు 46 శాతం పెరిగింది. ఎన్‌ఐఎంలు స్థిరంగా ఉన్నాయి. ఎన్‌ఐఐలో 18 శాతం వృద్ధి కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌లు ఫెడరల్‌ బ్యాంకు షేరుపై వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... - ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు రేటింగ్‌. రెవెన్యూ గ్రోత్‌ స్థిరంగా ఉంది. కానీ కొన్ని త్రైమాసికాలుగా అసెట్‌ క్వాలిటీ

Most from this category