News


లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఎవరి చేతికి వెళుతుందో.?

Friday 7th February 2020
Markets_main1581015179.png-31574

లక్ష్మీ విలాస్‌ బ్యాంకు, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ నో చెప్పిన నాలుగు నెలల తర్వాత.. దక్షిణాదికి చెందిన ఈ బ్యాంకులో పెట్టుబడులకు మూడు సంస్థలు ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ జాతీయ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ‘‘ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌, డీబీఎస్‌ ఇండియా లక్ష్మీ విలాస్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు రేసులో ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనలకు పాటించేందుకు గాను బ్యాంకుకు కనీసం రూ.2,000-2,500 కోట్ల నిధులు అవసరం. ఆర్‌బీఐ ఈ నెలాఖరులో సమావేశమై ఇన్వెస్టర్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకోనుంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి.

 

సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ బ్యాంకు అనుబంధ కంపెనీయే డీబీఎస్‌ బ్యాంకు ఇండియా. 2019 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 12 పట్టణాల్లో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఎవర్‌స్టోన్‌ మద్దతు కలిగిన ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ ఇటీవలే బ్రూక్‌ఫీల్డ్‌ బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా రూ.1,450 కోట్ల నిధులను సమీకరించింది. ‘‘డీబీఎస్‌ బ్యాంకు ఇండియాకు ఈ డీల్‌ భౌగోళికంగా విస్తరించేందుకు, ముఖ్యంగా దక్షిణాదిన విస్తరణకు తోడ్పడుతుంది. అలాగే, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ కూడా ఈ డీల్‌ రూపంలో తన రుణ పుస్తకాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది’’ అని ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ తెలిపారు. 

 

బ్యాంకు పరిస్థితి
లక్ష్మీ విలాస్‌ బ్యాంకు మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.505కోట్లుగా ఉంది. ప్రమోటర్లకు 6.78 శాతం వాటా ఉంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు 4.99 శాతం, క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌కు 2.62 శాతం, ఎల్‌ఐసీకి 1.62 శాతం, శ్రేయి ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌కు 1.92 శాతం వరకు వాటా ఉంది. సెప్టెంబర్‌ క్వార్టర్లో బ్యాంకు నష్టాలు రూ.357 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.132 కోట్లుగానే ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన తొలి ఆరు నెలల్లో బ్యాంకు నికర నష్టాలు రూ.594 కోట్లు కావడం గమనార్హం. 2019 జూన్‌ నాటికి స్థూల రుణాలు రూ.20,556 కోట్లు. మొత్తం డిపాజిట్లు రూ.28,980 కోట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 569 శాఖలు ఉన్నాయి. కార్యకలాపాలు ఎక్కువగా తమిళనాడులో కేంద్రీకృతమయ్యాయి.You may be interested

మారని రేట్లు.. వృద్ధికి చర్యలు

Friday 7th February 2020

మారని రేట్లు.. వృద్ధికి చర్యలు రియల్టీ, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలకు ప్రోత్సాహకాలు రెపో, రివర్స్‌ రెపో రేట్లలో యథాతథ స్థితికి మొగ్గు కొనసాగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు సర్దుబాటు విధానం కొనసాగింపు అవసరమైతే రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలు (అప్‌డేటెడ్‌...) ముంబై: వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్‌, రియల్టీ, ఎంఎస్‌ఎంఈ,

చెక్కుల క్లియరింగ్‌ మరింత వేగంగా..

Friday 7th February 2020

చెక్కులను ఎక్కువగా వినియోగించే వారిని సంతోషపెట్టే నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌)ను 2020 సెప్టెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్టు శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో భాగంగా వెల్లడించింది. ప్రస్తుతానికి సీటీఎస్‌ విధానం అమల్లో ఉంది కానీ, పెద్ద క్లియరింగ్‌ హౌసెస్‌ మధ్యే ఉందని ఆర్‌బీఐ స్పస్టం చేసింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల మధ్య లేదు. సీటీఎస్‌తో చెక్కుల క్లియరింగ్‌కు రోజుల తరబడి సమయం పట్టదు.

Most from this category