News


స్వల్పకాలానికి అప్రమత్తత!

Saturday 21st December 2019
Markets_main1576919109.png-30355

నిఫ్టీపై జిమిత్‌ మోదీ అంచనా
ఈ వారం నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలు నూతన గరిష్ఠాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లన్నీ బలంగా ఉండడం కలిసివచ్చింది. వాల్యూషన్లు అధికంగా ఉండడం, నెగిటవ్‌ వడ్డీరేట్లు, ట్రంప్‌ అభిశంసన, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉండడం... లాంటి నెగిటివ్‌ వార్తలున్నా మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించాయి. దేశీయంగా డీఐఐలు మార్కెట్లో కొనుగోళ్లకు విముఖత చూపుతున్నా, ఎఫ్‌ఐఐలు మాత్రం ఉధృతంగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. దీనివల్లే మార్కెట్లు అప్‌మూవ్‌ కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వైరుధ్య పరిస్థితి మార్కెట్లో ఆందోళనకు దారితీస్తుందని మార్కెట్‌ అనలిస్టు జిమిత్‌ మోదీ చెప్పారు. సూచీలు ఆల్‌టైమ్‌హైకి చేరినా కొన్ని స్టాకులు మాత్రమే కొత్త గరిష్ఠాలు చూశాయి. ఇందుకు భిన్నంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో చాలా వరకు ఏడాది కనిష్ఠాలకు చేరాయి. ఇవన్నీ మార్కెట్లో నిజమైన బుల్లిష్‌ సెంటిమెంట్‌ రావడానికి మరింత సమయం పడుతుందని సూచిస్తున్నాయి. ఎఫ్‌అండ్‌ఓ నిషేధ జాబితాలో స్టాకులు పెరగడం, ఐపీఓలకి పేలవ స్పందనలు.. సూచీలు టాప్‌ అవుట్‌ అయ్యాయనేందుకు సంకేతాలని జిమిత్‌ చెప్పారు. ఇప్పుడైతే ఈ సిగ్నల్స్‌ ఇంకా లేవని, అందువల్ల పరిమిత అప్‌సైడ్‌ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. 
టెక్నికల్స్‌..

నిఫ్టీ ప్రస్తుతం కొత్త రేంజ్‌లో కదలాడుతోంది. ఈ రేంజ్‌లో ఇంకా నిరోధాలు, మద్దతులు స్పష్టంగా కనిపించడంలేదు. మార్కెట్‌ మాత్రం ప్రస్తుతానికి ఇంకొంచెం ముందుకు వెళ్లేందుకే యత్నించవచ్చు. కానీ అప్‌మూవ్‌ చాలా పరిమితంగా ఉండొచ్చు. ఈ స్థాయిల వద్ద నిరోధం బలంగా ఉండే అవకాశం ఉంది. వాల్యూంలు కూడా మరింత పరుగులకు మద్దతుగా కనిపించడంలేదు. అందువల్ల కొంత కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌ తర్వాత తిరిగి అప్‌మూవ్‌ ఉండొచ్చు. ఒకవేళ తాజా జోన్‌ను దాటితే నిఫ్టీ 12400 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. సంవత్సరాంతంలో కొన్ని స్టాకుల కౌంటర్లో బలమైన అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ సమయంలో ఏడాది కాలపరిమితితో సిమెంట్‌, మెటల్‌, సుగర్‌, సెరామిక్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాక్స్‌ను ఎంచుకోవచ్చు. వీటిలో కూడా నాణ్యమైన కంపెనీలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. You may be interested

పిచాయ్‌కు అదిరిపోయే ప్యాకేజీ

Saturday 21st December 2019

వేతనం కాకుండా దాదాపు రూ. 1700 కోట్ల ప్యాకేజీ ఆల్ఫాబెట్‌ కొత్త సీఈఓ సుందర్‌పిచాయ్‌కు బంపర్‌ ప్యాకేజీని కంపెనీ ఆఫర్‌ చేసింది. 2020లో వార్షిక వేతనం 20 లక్షల డాలర్లతో పాటు 24కోట్ల డాలర్ల(దాదాపు రూ. 1,700 కోట్లు) విలువైన స్టాక్‌ ప్యాకేజీని అందించనుంది. ఆల్ఫాబెట్‌ మరియు గూగుల్‌ సీఈఓగా పదవీ బాధ్యతలు పెరిగినందున సుందర్‌కు ఈ ప్యాకేజీ ఇస్తున్నట్లు కంపెనీ అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌కు తెలిపింది. ఈ మొత్తం ఆయనకు

లాభపడ్డ ఏడీఆర్‌లు

Saturday 21st December 2019

అమెరికాలో ట్రేడయ్యే భారత్‌ ఏడీఆర్‌లు శుక్రవారం దాదాపు 2శాతం వరకు పెరిగాయి. టాటా మోటర్స్‌, వేదాంత ఏడీఆర్‌లు తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. విప్రో ఏడీఆర్‌ అత్యధికంగా 2శాతం పెరిగింది. ఐసీఐసీఐ ఏడీఆర్‌ 1.50శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 1శాతం నష్టపోగా, వేదాంత ఏడీఆర్‌లు అరశాతం పతనయ్యాయి.  రికార్డు స్థాయిలో

Most from this category