News


డాబర్‌ భళా- బీఈఎల్‌, జేకే టైర్‌ బోర్లా

Friday 31st January 2020
Markets_main1580461112.png-31374

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌
డాబర్‌ ఇండియా లాభాల్లో
బోర్లాపడిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌
నష్టాలలో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌

ఆర్థిక సర్వే, బడ్జెట్‌ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి  హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం డాబర్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. అయితే మరోవైపు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు నిరాశరపరచడంతో ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌​కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి డాబర్‌ ఇండియా లాభాలతో కళకళలాడుతుంటే.. జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, బీఈఎల్‌ కౌంటర్లు నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

డాబర్‌ ఇండియా లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ అంచనాలను మించిన ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 9 శాతం పుంజుకుని రూ. 398 కోట్లకు చేరింది. అయితే రూ. 20 కోట్లమేర పెట్టుబడులపై నష్టాలు నమోదుకావడంతో లాభాలు తగ్గినట్లు కంపెనీ తెలియజేసింది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 2353 కోట్లను తాకింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో డాబర్‌ ఇండియా షేరు ప్రస్తుతం దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 501 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 503ను అధిగమించింది.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 57 శాతం క్షీణించి రూ. 223 కోట్లకు చేరింది. ముడివ్యయాలు, తక్కువ మార్జిన్లు వంటి అంశాలు లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ తెలియజేసింది. నిర్వహణ లాభం సైతం 57 శాతం పడిపోయి రూ. 298 కోట్లకు పరిమితమైంది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 18 శాతం నీరసించి రూ. 2183 కోట్లను తాకింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ షేరు ప్రస్తుతం 10 శాతం పతనమై రూ. 91 వద్ద ట్రేడవుతోంది. 

జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 59 శాతం పడిపోయి రూ. 11 కోట్లకు పరిమితమైంది. నిర్వహణ లాభం సైతం 48 శాతం క్షీణించి రూ. 23 కోట్లకు చేరింది. కాగా.. క్యూ3లో మొత్తం ఆదాయం 19 శాతం వెనకడుగుతో రూ. 2200 కోట్లను తాకింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో జేకే టైర్‌ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 75 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.You may be interested

6-6.5 శాతానికి జీడీపీ వృద్ధి...ఆర్థిక​ సర్వే

Friday 31st January 2020

ఆర్థిక సర్వే అంచనా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6- 6.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎకానమీలో వృద్ధి క్షీణత బాటమ్‌ అవుట్‌ అయిందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 5 శాతం ఉంటుందని సర్వే తెలిపింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే ప్రభుత్వం సంస్కరణల పథాన్ని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది.

స్టేట్‌బ్యాంక్‌ నికర లాభం రూ. 5583 కోట్లు

Friday 31st January 2020

స్టాండెలోన్‌ ప్రాతిపదికన 41 శాతం అప్‌ 2.6 శాతం పుంజుకున్న ఎస్‌బీఐ షేరు  దేశీ బ్యాంకింగ్‌  రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) స్టాండెలోన్‌ ప్రాతిపదికన రూ. 5,583 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 41 శాతం వృద్ధికాగా.. ఎస్సార్‌ స్టీల్‌, ఎన్‌ఐఐ తదితర మొండి ఖాతాల నుంచి రికవరీలు లాభాల్లో వృద్ధికి సహకరించినట్లు ఎస్‌బీఐ

Most from this category