News


రాబోయే వారం ఎలా ఉంటుంది?

Saturday 9th February 2019
Markets_main1549714600.png-24116

గత వారం నిఫ్టీ ఉర్రూతలూగించినట్లు కనిపించినా చివరకు తుస్సుమని నిరాశ పరిచింది. వారం చివర్లో పతనమై వారం మొత్తం ఆర్జించిన లాభాలను దాదాపు ఆవిరి చేసింది. వారాంతానికి నిఫ్టీ దాదాపు అరశాతం మాత్రమే లాభపడి 10943 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త వారం పేలవ ఆరంభం ఉండొచ్చని అంచనా. మార్కెట్లు మరోమారు కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. గతవారం మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నట్లు కనిపించినా మార్కెట్‌ అంతర్‌వ్యత్యాసం(అడ్వాన్సులు:డిక్లైన్లు) నెగిటివ్‌గా ఉండడంతో బుల్స్‌కు పట్టు చిక్కలేదు. రాబోయే వారం నిఫ్టీకి 11100 పాయింట్ల వద్ద నిరోధం, 10915 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తాయి. కీలక మద్దతు 10775 పాయింట్ల వద్ద ఉంది. ఇక్కడే 50 రోజుల డీఎంఏ స్థాయి ఉంది. నిఫ్టీ 10700 పాయింట్లను కోల్పోతే పతనం మరింత వేగంగా ఉండొచ్చని అంచనా. కన్సాలిడేషన్‌ కొనసాగినా 10950 పాయింట్ల పైన స్థిరీకరణ జరిగితేనే బుల్స్‌కు పట్టు లభిస్తుంది. లేదంటే కరెక‌్షన్‌కు ఎక్కువ ఛాన్సులుంటాయి.

సూచీల్లో అనిశ్చితి తొలగే వరకు ఎంపిక చేసిన స్టాకులపై దృష్టి పెట్టడం ఉత్తమం. రాబోయే వారంలో ఐటీ రంగంలో లాభాల స్వీకరణకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ చార్టుల్లో హెడ్‌అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ కనిపిస్తోంది. ఈ పాటర్న్‌ దిగువ అవధిని నిఫ్టీ కాపాడుకోలేకుంటే కరెక‌్షన్‌ వేగంగా ఉండొచ్చు. ఎర్నింగ్స్‌ సీజన్‌ దాదాపుగా ముగిసినందున సూచీలకు తక్షణ పాజిటివ్‌ ట్రిగ్గర్లు ఏమీ లభించకపోవచ్చు. ఎక్కువ శాతం అంతర్జాతీయ అంశాలే సూచీలను నడిపించేందుకు ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 



You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిప్టీ

Monday 11th February 2019

విదేశీ మార్కెట్లో  ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం గం.8:50ని.లకు 10,930.00 వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి పోలిస్తే 27పాయింట్ల నష్టంతో ఉంది. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియాలో చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ మార్కెట్ల లాభాల్లో ఉండగా, మిగిలిన మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా,

బయటపడేందుకు చివరి అవకాశం!

Saturday 9th February 2019

ఇన్వెస్టర్లకు సామ్‌కో సెక్యూరిటీస్‌ సూచన దేశీయ మార్కెట్లు మరింత ముందుకు దూసుకుపోయే సత్తా కోల్పోయాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. ఇకపై సూచీలు వెనుకంజ వేయక తప్పదని అంచనా వేశారు. ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను వదిలించుకునేందుకు ఇదే మంచి తరుణమని, తేడా వస్తే మార్కెట్‌క్రాష్‌లో ఇరుక్కుపోతారని హెచ్చరించారు. గతవారం నిఫ్టీ చార్టుల్లో ఈవెనింగ్‌స్టార్‌ను ఏర్పరిచిందని, బేరిష్‌నెస్‌కు ఇది సంకేతమని వివరించారు. నిఫ్టీ బలంగా 11,000 వేల పాయింట్లపైకి వెళ్లినా,

Most from this category