గంటలో రూ.5లక్షల కోట్లు..!
By Sakshi

దేశీయ కంపెనీలపై కార్పోరేట్ పన్ను తగ్గించడంతో గురువారం సూచీలు లాభాల మోత మోగించాయి. నిఫ్టీ సూచీ పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ చేసింది. సెన్సెక్స్ 1956 పాయింట్లు ఎగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల సునామీ వెల్లువత్తడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక గంటలో రూ.రూ.5లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గురువారం మార్కెట్ ముగిసే సరికి రూ.138.54లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి కార్పోరేట్ పన్నును 30 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఉదయం 11 గంటలకు ప్రకటన చేసిన తరువాత 60నిమిషాల్లో సంపద రూ.143.45 లక్షల కోట్లకు పెరిగింది.
‘‘బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, కన్జూ్యమర్ డ్యూరబుల్స్, అటో కంపెనీలు అధికంగా లబ్ధిగా పొందే అవకాశం. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో... ఇండియాలో నూతన తయారీ రంగ కంపెనీలకు 15శాతం కార్పోరేట్ పన్ను పరిమితితో తయారీరంగం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ’’ అని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ సీఈవో రాజీవ్ సింగ్ తెలిపారు.
మధ్యాహ్నం గం.1:15ని.లకు సెన్సెక్స్ 1922 పాయింట్లు లాభంతో 38,015.62 వద్ద, నిఫ్టీ 553.20 పాయింట్లు పెరిగి 11,258.00 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
You may be interested
బీపీసీఎల్ జోరు..లాభాల్లో ఇంధన షేర్లు
Friday 20th September 2019కేంద్ర ఆర్థిక మంత్రి, అనూహ్యంగా దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు చర్యలను ప్రకటించడంతో దేశీయ మార్కెట్లు అమాంతం పెరిగాయి. ఇటువంటి పరిస్థితులలో బీపీసీఎల్(భారత్ పెట్రోలియం కార్పోరేషన్)లోని ప్రభుత్వ వాటాను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయించనుందనే అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి. మొత్తంగా శుక్రవారం ట్రేడింగ్‌లో బీపీసీఎల్ షేరుమధ్యాహ్నాం 2.14 సమయానికి 13.37 శాతం లాభపడి రూ. 429.65 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ 4.70 శాతం
మెటల్ షేర్ల ర్యాలీ..టాటా స్టీల్ 9 శాతం అప్
Friday 20th September 2019దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా తగ్గించడంతో మార్కెట్ శుక్రవారం ట్రేడింగ్‌లో అమాంతం పెరిగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఉదయం 12.54 సమయానికి 5.25 శాతం లాభపడి 2,487.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్ 9.14 శాతం, జిందాల్ స్టీల్ 8.67 శాతం, వెల్సపన్ కార్ప్ 7.32 శాతం, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 6.96 శాతం, వేదాంత 6.57 శాతం, సెయిల్