News


నిర్మల నియామకంపై మార్కెట్‌ స్పందన

Friday 31st May 2019
Markets_main1559296781.png-26024

అనూహ్యమంటున్న మార్కెట్‌ వర్గాలు
దేశీయ సూచీలు శుక్రవారం ఆరంభలాభాలను కోల్పోయాయి. ఒకదశలో ఒక్కసారిగా భారీ పతనం నమోదు చేసిన సూచీలు తిరిగి కోలుకొని స్వల్పనష్టాల్లో ట్రేడవుతున్నాయి. కొత్త విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్‌ నియామకం నేపథ్యంలో మార్కెట్‌ స్పందన మిశ్రమంగా ఉంది. నిజానికి ఇది దలాల్‌ స్ట్రీట్‌కు నిజంగా ఆశ్చర్యకరమైన నియామకమేనని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి ఆర్థిక మంత్రిగా అమిత్‌షా వస్తారని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కొందరేమో గతంలో జైట్లీ పరోక్షంలో విత్త బాధ్యతలు నిర్వహించిన పీయూష్‌ గోయల్‌కు అవకాశం వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా నిర్మల తెరమీదకు వచ్చారు. గత ప్రభుత్వంలో నిర్మల రక్షణమంత్రిగా పనిచేశారు. కొత్తగా ఫైనాన్స్‌ మినిస్టర్‌ బాధ్యతలు స్వీకరించిన నిర్మలాసీతారామన్‌ నుంచి మార్కెట్‌ వర్గాలు పలు సంస్కరణలు ఆశిస్తున్నాయి.


 నిర్మల నియామకం ఆశ్చర్యకరం. పీయూష్‌ పేరును మార్కెట్లు అంచనా వేశాయి. కానీ నిర్మలా సీతారామన్‌ ఈ పదవికి సరైన ఎంపికే. నిర్మల నియామకంపై ఎఫ్‌ఐఐలు పెద్దగా సంతోష పడరు, అలాగని భారీ అమ్మకాలకు దిగరు.

- అంబరీశ్‌ బాలిగ, మార్కెట్‌ నిపుణుడు


 దేశీయ ఎకానమీని నడిపేందుకు నిర్మల సరిగ్గా సరిపోతారు. అందుకు తగిన అర్హతలు ఆమెకు ఉన్నాయి. ప్రస్తుతం ఎకానమీ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. వినిమయం తగ్గడం, ప్రైవేట్‌ క్యాపెక్స్‌లో జోరు లేకపోవడం, ఎగుమతుల క్షీణత లాంటి ఇబ్బందులున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ సంక్షోభం డిమాండ్‌ను క్షీణింపజేస్తోంది. ఈ దశలో ఎకానమీలో ఉత్తేజం నింపేందుకు ఆమె ఎలాంటి చర్యలు తీసకుంటారో వేచిచూడాలి. ముఖ్యంగా బలమైన మౌలిక వసతుల కల్పన, టాక్స్‌ టు జీడీపీ నిష్పత్తి పెంచడం, పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా చేయడం వంటి చర్యలు అవసరపడతాయి.

 -అజయ్‌ బోడ్కె, ప్రభుదాస్‌ లీలాధర్‌ పోర్టుఫోలియో మేనేజర్‌.


 వాణిజ్య, రక్షణ శాఖల్లో నిర్మల తన ప్రతిభను చాటారు. ఇప్పటికే పీయూష్‌ చేతిలో రైల్వేలున్నాయి. అందువల్ల విత్తమంత్రి పదవికి నిర్మలే సరైన ఎంపిక.

- దేవన్‌ చౌక్సీ, కేఆర్‌చౌక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎండీ.


నిర్మలా సీతారామన్‌ అటు దూకుడుగా పోయే మనిషి కాదు, ఇటు అతి రక్షణాత్మకంగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఆమె సరైన సమతుల్యత ఉన్న వ్యక్తి. అందువల్ల ఈ పదవికి సరిపోతారు.

- సమీర్‌ కల్రా, టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ ప్రతినిధిYou may be interested

కొత్త ఆర్థిక మంత్రికి నష్టాల స్వాగతం

Friday 31st May 2019

118 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 23 పాయింట్లను నష్టపోయి నిఫ్టీ  నూతన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మార్కెట్‌ నష్టాలతో స్వాగతం పలికింది.  నరేంద్రమోదీ కేబినెట్‌లో 57 మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు. అందులో నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు.  ఆర్ధిక మంత్రిగా సీతారామన్‌ నియమానికి మార్కెట్ ప్రతికూలంగా స్పందించింది. ఫలితంగా 118 పాయింట్లు నష్టపోయి 39,714 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 11,923 వద్ద ముగిసింది. నేడు జూన్‌

బుల్‌ రన్‌ కొనసాగేనా?!

Friday 31st May 2019

దేశీయ సూచీలు శుక్రవారం ఆల్‌టైమ్‌ హైకి దగ్గరగా వెళ్లి వెనుదిరిగాయి. సూచీలు గరిష్ఠస్థాయిల్లో కదలాడుతున్నా కేవలం 30 స్టాకులు మాత్రమే కొత్తగా ఏడాది గరిష్ఠాన్ని తాకాయని గణాంకాలు వివరిస్తున్నాయి. దీన్నిబట్టి మార్కెట్‌ అప్‌మూవ్‌లో గాఢత లోపించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సూచీలు దాదాపు 10 శాతం ర్యాలీ జరిపాయి. కానీ కేవలం 30 స్టాకులు మాత్రమే ఏడాది గరిష్ఠాలను చూడడమనేది బుల్స్‌ అలుపునకు సంకేతంగా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే

Most from this category