News


బడ్జెట్‌పై మార్కెట్‌కు ఆశల్లేవా?!

Thursday 4th July 2019
Markets_main1562228699.png-26793

దేశీయ మార్కెట్లో తీవ్ర కదలికలను సూచించే వీఐఎక్స్‌ సూచీ గతంలో బడ్జెట్‌ సమయంలో బాగా పెరుతుండేది. బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయన్న నమ్మకంతో వీఐఎక్స్‌లో పెరుగుదల ఉండేది. కానీ ఈ దఫా బడ్జెట్‌కు ముందు వీఐఎక్స్‌ సూచీ బాగా తక్కువగా ఉంది. బడ్జెట్‌పై మార్కెట్‌కు పెద్దగా అంచనాల్లేవనేందుకు ఇది నిదర్శనంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రకటనలు భారీ కదలికలను ప్రేరేపించేవిగా ఉండవని మార్కెట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ 13.5 వద్ద ఉంది. గత నెలతో పోలిస్తే ఇది 15 శాతం వరకు పతనమైంది. ఈ రేంజ్‌లో బడ్జెట్‌కు ముందు వీఐఎక్స్‌ తక్కువగా ఉండడం బహుశా తొలిసారని ఎడెల్‌వీజ్‌ అభిప్రాయపడింది. మార్కెట్లు ఈ సారి బడ్జెట్‌ను ఒక ప్రభావం లేని అంశంగా భావిస్తున్నాయనేందుకు సంకేతమని తెలిపింది.

గత బడ్జెట్‌కు ముందు(మధ్యంతర బడ్జెట్‌, ఫిబ్రవరి 1) వీఐఎక్స్‌ దాదాపు 11 శాతం లాభపడిందని, గతేడాది సుమారు 26 శాతం ఎగిసిందని, 2017లో 9 శాతం మేర పుంజుకుందని గణాంకాల విశ్లేషణ వెల్లడిస్తోంది. ఎలక‌్షన్లు, బడ్జెట్‌ లాంటి కీలక సంఘటనల సమయంలో మార్కెట్లో కదలికలు తీవ్రంగా ఉంటుంటాయి. కానీ ఈ సారి కొత్త విత్త మంత్రి నిర్ణయాలపై సందిగ్ధత నెలకొన్నందున ట్రేడర్లు పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. స్థూల అంశాలపై బడ్జెట్లో స్పష్టత వస్తుందని, కానీ మార్కెట్‌ను కదలించేంతటి ప్రకటనలేవీ ఉండకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. గత ప్రభుత్వమే బడ్జెట్‌ను మరలా ప్రవేశపెడుతున్నందున మార్కెట్‌కు ఈ అంశంపై పెద్ద ఉత్సాహం లేదని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. You may be interested

బడ్జెట్‌ రోజున కొత్త గరిష్ఠాలకు ఛాన్స్‌?!

Thursday 4th July 2019

గణాంకాల విశ్లేషణ దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ సమయంలో తమ ఆల్‌టైమ్‌ హైకి దగ్గర్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌రోజు బ్రేకవుట్‌తో మరో ఆల్‌టైమ్‌ హైని మార్కెట్‌ చవిచూసే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే బడ్జెట్‌రోజు తీవ్ర కదలికలు చూపినా, చివరకు ఫ్లాట్‌గా మార్కెట్‌ ముగియడం ఎక్కువసార్లు కనిపిస్తుంది. పదేళ్లలో బడ్జెట్‌ రోజున బుల్స్‌ పట్టు బిగించిన సందర్భాలు ఐదు సార్లున్నాయని, ఈ ఐదు

బిజినెస్‌ @ పార్లమెంట్‌ న్యూస్‌

Thursday 4th July 2019

బీఎస్‌ఎన్ఎల్ నష్టాలు @ రూ. 14,202 కోట్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు రూ. 14,202 కోట్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభకు తెలిపారు. 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ. 4,793 కోట్లు, 2017-18లో రూ. 7,993 కోట్ల మేర నష్టాలు నమోదయ్యాయి. మొబైల్ విభాగంలో తీవ్ర పోటీ వల్ల టారిఫ్‌లు తగ్గడం, సిబ్బందిపై అధిక

Most from this category