News


భారత్‌లోకి 2,500 కోట్ల డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు: మోర్గాన్‌ స్టాన్లీ

Thursday 18th July 2019
Markets_main1563429724.png-27143

దేశియ మార్కెట్లలో ఫ్రీ ఫ్లోట్‌ సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ప్రతిపాదనలను తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. వీటి ఫలితంగా ఇండియా ఈక్విటీ మార్కెట్లలోకి  2,500 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చి చేరతాయని, అంతేకాకుండా ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్ల సూచీలో ఇండియా వెయిటేజీ 146 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనావేసింది.  ఇండియా స్టాక్స్‌ ఫ్రీ ఫ్లోట్‌ (ప్రమోటర్ల వాటా మినహా మిగతా పబ్లిక్‌ వాటా) పెంచడానికి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలు పాలసీలుగా మారితే ఇండియా ఫ్రీ ఫ్లోట్‌, ఎంఎస్‌సీఐ సూచీలో ఇండియా వెయిటేజీ, విదేశి నిధులు ప్రవాహాం, ఈక్వీటీ సరఫరాలపై ప్రభావం చూపనుంది.
    ఒక సంస్థలో ఎఫ్‌పీఐ పెట్టుబడుల కనీస చట్టబద్దమైన పరిమితిని 24 శాతం నుంచి ఆ రంగ విదేశీ పెట్టుబడుల పరిమితి వరకు పెంచాలని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది.  ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్ల సూచీలో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థలలోని విదేశి పెట్టుబడుల వాటాను ఆ సంస్థ ఉన్న రంగంలోని విదేశి పెట్టుబడుల అత్యధిక పరిమితి వరకు పెంచాలన్న ప్రతిపాదన వుంది.. అంతేకాకుండా ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఐ, ఎఫ్‌పీఐ ఇన్వెస్టమెంట్‌ మార్గాల్ని విలీనం చేసింది. 
    ‘‘ప్రభుత్వ ప్రతిపాదనలు అమలైతే అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల సూచీలో ఇండియా వెయిటేజీ 81 బేసిస్‌ పాయింట్లు పెరగనుంది. దీంతో ప్రత్యక్షంగా 1,140 కోట్ల డాలర్లు, పరోక్షంగా 280 కోట్ల డాలర్ల నగదు ప్రవాహం జరగనుంది. మొత్తంగా 1,420 కోట్ల డాలర్లకు ఈ ఇన్‌ఫ్లోలు చేరుకుంటాయి’ అని మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. పరిశ్రమ, వస్తు రంగాల కంపెనీల వెయిట్‌ పెరగనుందని తెలిపింది. ‘కొన్ని పీఎస్‌యూ సంస్థలలో పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ను ప్రభుత్వం 25 శాతానికి పెంచనుంది. వీటితోపాటు ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉన్న ఫైనాన్సేతర రంగ కంపెనీలలో కూడా పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ను పెంచనుంది. ఫలితంగా 3,100 కోట్ల డాలర్ల ఈక్విటీ సరఫరా జరగనుంది’ అని మోర్గాన్‌ స్టాన్లి వివరించింది. 
       స్టాక్‌ మార్కెట్లలలో నమోదైన కంపెనీలలో పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ వాటాను 25 శాతం నుం‍చి 35 శాతానికి పెంచే అవకాశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సెబీని కోరిన విషయం తెలిసిందే. ‘ ప్రభుత్వ తీసుకొచ్చిన పబ్లిక్‌ షేరు హోల్డింగ్‌ నిబంధన వలన బీఎస్‌ఈ 200 లోని కంపెనీలు మొత్తం కలిపి  3,000 కోట్ల డాలర్ల విలువైన స్టాకులను పబ్లిక్‌కు అందుబాటులోకి తీసుకురావాలి. ఫలితంగా కంపెనీలోని అత్యధిక నియంత్రణ స్థాయి 65 శాతానికి పడిపోతుంది’ అని తెలిపింది. 2009లో  పబ్లిక్‌ హోల్డింగ్‌ను 25 శాతానికి పెంచే ప్రతిపాదనను అమలు చేయడానికి సెబీకి ఏడాది కాలం పట్టిన విషయం తెలిసిందే.



You may be interested

‘ఇంటెల్లిజెంట్‌ వెహికిల్స్‌’ వస్తున్నాయ్‌

Thursday 18th July 2019

డ్రైవర్‌ వాహనాన్ని నడుపుతున్న తీరు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు హెచ్చరించడం.. అలాగే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అలర్ట్‌ చేయడమేగాక, స్పందించే వ్యవస్థ వెహికిల్‌లో ఉంటే! ఇంకేముంది.. ఎంచక్కా నిశ్చింతగా ప్రయాణించొచ్చు. ఆటోమోటివ్‌ రిసర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) ఈ పనిలో నిమగ్నమవడమేగాక అందుకు తగ్గ వ్యవస్థను అభివృద్ధి చేసింది కూడా. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్‌లోని పలు వాహన తయారీ కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఏఆర్‌ఏఐ డైరెక్టర్‌ రశ్మి

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

Thursday 18th July 2019

టెక్నాలజీ సంస్థ ఐసెర్టిస్‌లో పెట్టుబడులు బిలియన్‌ డాలర్లకు సంస్థ విలువ బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ తోడ్పాటుతో ఒక స్టార్టప్‌ సంస్థ బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌ స్థాయికి చేరింది. క్లౌడ్‌ ఆధారిత కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ఐసెర్టిస్‌ సంస్థలో అజీం ప్రేమ్‌జీ కుటుంబానికి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ ఫండ్, గ్రేక్రాఫ్ట్‌ పార్ట్‌నర్స్‌ తదితర సంస్థలు 115 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన బి

Most from this category