News


ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు ఎందుకు పట్టలేదు?

Tuesday 11th December 2018
Markets_main1544524852.png-22830

మరోమారు దేశీయ సూచీలు అంచనాలకు భిన్నంగా స్పందించాయి. రాజకీయాలను, ఎన్నికల ఫలితాలను అందరూ చూసేలా కాకుండా వేరే కోణంలో చూస్తామని మార్కెట్లు నిరూపించాయి. ఒకపక్క ఉర్జిత్‌ రాజీనామా వ్యవహారం బెంబేలెత్తిస్తుందని, ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి సానుకూలంగా రాకపోవడంతో ఇక భారీ పతనమేనని చాలామంది భావించారు. ఇందుకు తగ్గట్లే మార్కెట్లు సోమవారం ఎగ్జిట్‌ పోల్స్‌కు బాగా నెగిటివ్‌గా స్పందించాయి. మంగళవారం ఆరంభంలో కూడా ఇదే విధంగా భారీ పతనాన్ని సూచీలు నమోదు చేసాయి. సెన్సెక్స్‌ సుమారు 500 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. కానీ మధ్యాహ్నం దాటేసరికి సూచీలు క్రమంగా కోలుకున్నాయి. ట్రేడింగ్‌ చివరకు లాభాల్లో ముగిశాయి. రూపాయి సైతం ఆరంభంలో 112 పైసల మేర నష్టపోయి క్రమంగా రికవరీ నమోదు చేసింది.
కారణాలు అనేకం..
మార్కెట్లో కనిపించిన ఈ సహనశీల రికవరీకి అనేక కారణాలుండవచ్చని నిపుణుల అభిప్రాయం. 

  • ఎన్నికల ఫలితాలతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలినట్లే కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ప్రమాదం లేదు. బీజేపీకి ఈ మాత్రం ఎదురుదెబ్బ తగిలితేనే కానీ, కళ్లు భూమ్మీదకు రావని బుల్స్‌ ఉద్దేశం. అందుకే ఫలితాలు నెగిటివ్‌గా ఉన్నా బీజేపీ కళ్లు తెరుస్తుందన్న ఆశలు బుల్స్‌ను నడిపించాయి.
  • మధ్యప్రదేశ్‌లో ఇరు పక్షాలకు దాదాపు సమానమైన సీట్లు వచ్చినందున బీజేపీ ఎలాగోలా చక్రంతిప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుందన్న నమ్మకం.
  • టీఆర్‌ఎస్‌, ఎంఎన్‌ఎఫ్‌లు పైకి బీజేపీని వ్యతిరేకించినా లోపల్లోపల బీజేపీకి మద్దతు ఇస్తాయన్న అంచనాలు.
  • రాజస్తాన్‌లో హోరాహోరి పోరు చూస్తే లోక్‌సభ ఎన్నికల్లోపు బీజేపీ పుంజుకుంటుందన్న నమ్మకం మార్కెట్లకు కలిగి ఉండవచ్చు.
  • బీజేపీ భారీ పరాజయంతో మార్కెట్లు ఆరంభంలో మంచి పతనం చవిచూసింది,  ఈ స్థాయిలను పెట్టుబడులకు తగిన అవకాశంగా మదుపరులు భావించి కొనుగోళ్లు జరపడంతో రికవరీ సాధ్యమైంది.

రాజకీయ మార్పులతో ఎలాంటి తలనొప్పులు వస్తాయో చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీల మేనేజ్‌మెంట్‌ది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి వృద్ది నమోదు చేయగల మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీని ఎంచుకోవడమే ఇన్వెస్టర్‌ బాధ్యత. అలాంటి షేరును ఎంచుకొని పెట్టుబడి పెట్టిన తర్వాత స్వల్పకాలిక ఒడిదుడుకులను పట్టించుకోకుండా వేచిచూడడమే ఉత్తమమని నిపుణుల సూచన.You may be interested

డిసెంబర్‌ ముగిసేలోపు వీటిపై ఓ సారి లుక్కేయరూ!

Wednesday 12th December 2018

ఈ ఏడాది ముగిసేలోపు అంటే మరో 20 రోజుల్లోపు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన ఆర్థిక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఈవీఎం చిప్‌ కార్డులు, సీటీఎస్‌ చెక్‌బుక్కులు తదితరమైనవి ఉన్నాయి. వాటి గురించి వివరంగా చూస్తే...   ఆలస్యంగా ఐటీ రిటర్నులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు వేయడం మర్చిపోయి ఉంటే, సకాలంలో దాఖలు చేయకుంటే ఒక అవకాశం ఉంది. బీలేటెడ్‌ ఐటీఆర్‌ను

నష్టాల్లోంచి... లాభాల ముగింపు

Tuesday 11th December 2018

ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్ల ర్యాలీ 781 పాయింట్ల రేంజ్‌ కదలాడిన సెన్సెక్స్‌ ఐటీ, ఫార్మా, ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలుబడున్న నేపథ్యంతో పాటు, డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత, ఆర్‌బీఐ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఉదంత భయాలతో సూచీలు భారీ గ్యాప్‌ డౌన్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా కొనుగోళ్ల అండతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడంతో

Most from this category