News


కొత్త ఏడాది ఈక్విటీ రిటర్న్స్‌ అంతంతమాత్రమే!

Friday 20th December 2019
Markets_main1576819984.png-30334

బ్రోకరేజ్‌ల అంచనాలు
వచ్చే సంవత్సరం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఒక మోస్తరు రాబడులే అందిస్తాయని ప్రముఖ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వాల్యూషన్లు పెరిగిపోవడం, ఆర్థిక మందగమనం కొనసాగడం, ప్రభుత్వం నుంచి విత్త సాయానికి పరిమిత అవకాశాలుండడం.. మార్కెట్లపై ఒత్తిడి పెంచుతాయని అభిప్రాయపడ్డాయి.

నిఫ్టీ, సెన్సెక్స్‌లపై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
1. బీఎన్‌పీ పారిబా: సెన్సెక్స్‌పై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌, 2020 టార్గెట్‌ 44,500. జీడీపీ వృద్ది అంచనాల్లో మరిన్ని కోతలు ఉండొచ్చు. పన్ను తగ్గింపులు, ప్రభుత్వవ్యయం పెంచడం వంటి మార్గాల ద్వారా ఎకానమీలో ఉత్తేజం తెచ్చేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. ఇప్పట్లో ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకోవు. బ్యాంకులపై ఎన్‌పీఏల ఒత్తిళ్లు ఇంకా తగ్గినట్లు కనిపించడం లేదు. అయితే ఈక్విటీల్లోని వైవిధ్యత కారణంగా భారీ పతనాలు ఉండకపోవచ్చు. 
2. మేబ్యాంక్‌ కిమింగ్‌ సెక్యూరిటీస్‌: న్యూట్రల్‌ రేటింగ్‌, నిఫ్టీ టార్గెట్‌ బుల్‌కేస్‌లో 13400, బేస్‌కేస్‌లో 11600, బేర్‌కేస్‌లో 9900 పాయింట్లు. దేశ ఎకానమీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త ఏడాది సెక్టార్‌ రొటేషన్‌ కనిపించవచ్చు. ఎక్కువ స్టాకులు ఈ దఫా మార్కెట్‌ ర్యాలీలో పాలుపంచుకునే అవకాశాలున్నాయి. బడ్జెట్లో సాహసోపేతమైన చర్యలుంటే మార్కెట్‌కు ఉత్ప్రేరకాలుగా మారతాయి. 
3. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: నిఫ్టీ టార్గెట్‌ 13100. వాల్యూషన్లు పెరగడంతో నిఫ్టీ రాబడులు పరిమితంగా ఉంటాయి. ఇన్వెస్టర్లు రిస్కు తక్కువ పెట్టుబడి సాధనాల వైపు దృష్టి పెట్టడం కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నెగిటివ్‌ వడ్డీరేట్లు కొనసాగుతాయి. వివిధ దేశాల కేంద్రబ్యాంకులు బంగారం కొనుగోలుపై మక్కువ చూపుతాయి. 
4. క్రెడిట్‌ సూసీ: ఆర్థిక మందగమనం కొనసాగుతుంది. ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో ఫండ్స్‌ ఎక్కువగా రక్షణాత్మక స్టాకులవైపే చూస్తుంటాయి. మార్కెట్లో కొనసాగుతున్న క్వాలిటీ బబుల్‌(క్వాలిటీ స్టాకులపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడం) మరో ఆరునెలలు కొనసాగుతుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిధులు మార్కెట్లను నిలబెడుతుంటాయి. You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 20th December 2019

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,526.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఏకకాలంలో రూ.10000 కోట్ల విలువ కలిగిన 10ఏళ్ల బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు విక్రయిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. 2029లో పరిపక్వమయ్యే రూ.10,000 కోట్లకు

2వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 20th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ట్రంప్‌ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమెరికా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలతో ప్రత్యర్ది పార్టి డెమోక్రటిక్‌ సభ్యులు ట్రంప్‌ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం అయిన నేపధ్యంలో అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. సెనెట్‌(ఎగువ)లోనూ తీర్మానానికి ఆమోదం

Most from this category