News


ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌- ఫలితాల జోష్‌

Monday 13th January 2020
Markets_main1578890538.png-30884

తొలుత డీమార్ట్‌ షేరు 3.3 శాతం ప్లస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ రిటైల్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం(ఉదయం 10 ప్రాంతంలో) ఎన్‌ఎస్‌ఈలో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1.2 శాతం బలపడి రూ. 1898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 3.3 శాతం జంప్‌చేసి గరిష్టంగా రూ. 1940ను అధిగమించింది. 

ఫలితాల జోరు
డీమార్ట్‌ బ్రాండుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 53 శాతంపైగా జంప్‌చేసి రూ. 394 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 24 శాతం ఎగసి రూ. 6,752 కోట్లకు చేరింది. దీంతో ఈ కౌంటర్‌ సానుకూలంగా ట్రేడవుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు.



You may be interested

ప్రారంభంలో రికార్డుల హోరు

Monday 13th January 2020

రెండోరోజూ ఆల్‌టైం హైని అందుకున్న నిఫ్టీ  డిసెంబర్‌ 20న తర్వాత తొలిసారి ఆల్‌టైంకి సెన్సెక్స్‌ ఐటీ, మెటల్‌, బ్యాంక్‌ ఫార్మా షేర్ల ర్యాలీతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో 41,893 వద్ద  నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 12,337.75 వద్ద ఆల్‌టైం హైకి అందుకున్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడవచ్చనే అంచనాలతో నేడు ఆసియా

ఇన్ఫీపై బుల్లిష్‌!

Monday 13th January 2020

క్యు3 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌లు మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్ఫోసిస్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌ అంచనాలను కొనసాగించాలని నిర్ణయించాయి. శుక్రవారం కంపెనీ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది. దీంతో పలు బ్రోకరేజ్‌లు రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేయడం లేదా టార్గెట్‌ పెంచడం లేదా రెండూ చేయడం చేపట్టాయి. క్యు3లో కంపెనీ నికరలాభం దాదాపు 24 శాతం పెరిగింది. దీనికితోడు పూర్తి ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్‌ను కంపెనీ పెంచింది. ఇటీవల కొందరు

Most from this category