నిఫ్టీలో షార్ట్స్ వద్దు!
By D Sayee Pramodh

నిపుణుల సూచన వీక్లీ చార్టుల్లో నిఫ్టీ డ్రాగన్‌ఫ్లై డోజీ ఏర్పరిచింది. ఇది బుల్లిష్ ట్రెండ్ రివర్సల్‌కు సంకేతం. ఇటీవలే నిప్టీ మిడ్‌క్యాప్ సూచీ బ్రేకవుట్ సాధించగా, స్మాల్‌క్యాప్ సూచీ అదేబాటలో ఉంది. అంటే మార్కెట్ విస్తృతి క్రమంగా పాజిటివ్‌గా మారుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు నిఫ్టీ వరుసగా మూడు సీరిస్‌లు నష్టాలను అందించింది. అందువల్ల గత చరిత్ర ప్రకారం చూస్తే ఈ నెల తప్పక నిఫ్టీలో పాజిటివ్ ముగింపు వచ్చే అవకాశాలున్నాని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు.
నిఫ్టీ టెక్నికల్ సెటప్ చూస్తే బేరిష్ నుంచి బుల్లిష్ ట్రెండ్‌లోకి మారినట్లు కనిపిస్తుందని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఈ సమయంలో కొత్త షార్ట్స్ వద్దని, కావాలంటే లాంగ్స్ పరిశీలించవచ్చని సలహా ఇస్తున్నారు. లాంగ్స్‌కు 10787పాయింట్లను స్టాప్‌లాస్‌ను పెట్టుకోవాలని సూచించారు. ఐదు వారాలుగా నిఫ్టీ 10750- 11100 పాయింట్ల రేంజ్లో కన్సాలిడేట్ అవుతోంది. దిగువన నిఫ్టీ వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందుతోంది. నిఫ్టీకి 11142- 11181 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఉందని, ఇది దాటితే 11600- 11650 వరకు ర్యాలీ ఉండొచ్చని అంచనా. బుల్లిష్ట్రెండ్ నిర్ధారణకు డౌ సిద్ధాంతం ప్రకారం చార్టుల్లో వరుసగా హయ్యర్ బాటమ్ తర్వాత హయ్యర్ టాప్ ఏర్పడాలి. నిఫ్టీ 11142 పాయింట్ల వద్ద హయ్యర్ బాటమ్ ఏర్పడిందని, ఈ స్థాయికి పైన హయ్యర్‌టాప్ ఏర్పడాల్సిఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ఏర్పడితే బుల్లిష్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ బ్రేకవుట్ కూడా నిర్ధారణ అవుతుందంటున్నారు. ఇదే జరిగితే 11650 పాయింట్ల వరకు ర్యాలీ జరగవచ్చు.
You may be interested
యస్‌బ్యాంక్16శాతం ర్యాలీ ..!
Wednesday 11th September 2019యస్‌బ్యాంక్ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.66.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ కంపెనీ ఒకటి యస్‌బ్యాంక్‌లో స్వల్ప వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి వాస్తవమేని కంపెనీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డెరెక్టర్ రవ్నీత్గిల్ వివరణ ఇచ్చారు. సదరు కంపెనీ బ్యాంక్‌లో 10శాతం వాటాకు మించుకుండా కొనుగోలు చేస్తుందని, ఇప్పటికి వరకు ఎలాంటి
బుధవారం వార్తల్లోని షేర్లు
Wednesday 11th September 2019వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- రష్యాకు చెందిన పిజేఎస్సీ బయోసింటెజ్ కంపెనిలో తన మొత్తం వాటాను 100శాతానికి పెంచుకుంది. జేకే టెర్స్:- కంపెనీ డిప్యూటీ ఎండీగా అన్షుమాన్ సింఘానియా రాజీనామా చేశారు. టాటా మోటర్స్:- ఆగస్ట్‌లో జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.7శాతం క్షీణించి 34,176 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్:- కంపెనీ అడిటర్ సంస్థగా బాస్కర్ అండ్ కో ని