News


‘2002-03 తరహా సంక్షోభం కాదు..’

Saturday 24th August 2019
Markets_main1566585741.png-27978

ఆర్థిక రంగంలో ప్రస్తుతం నెలకొన్న బలహీనత 2002-03 నాటి సంక్షోభం మాదిరి కాదన్నారు క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ పరిశోధన విభాగం హెడ్‌ గౌరవ్‌గార్గ్‌. ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని బేర్‌ మార్కెట్‌తో పోల్చరాదని అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఆరోగ్యకమైర దిద్దుబాటుకు గురయ్యాయని, ఇకపై అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొన్నారు. 

 

‘‘సూచీలు గరిష్టాల నుంచి 10 శాతం మేర కరెక్షన్‌కు గురయ్యాయి. కనుక ఇన్వెస్టర్లు తాము ఇన్వె‍స్ట్‌ చేయదలిచిన మొత్తంలో 60 శాతాన్ని నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుకునేందుకు ఇది అనువైన సమయం. ప్రస్తుత స్థాయిల నుంచి మార్కెట్లు పెరిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్లు పడిపోతే ఆ అవకాశాలను సొంతం చేసుకునేందుకు మరో 40 శాతం పెట్టుడులను రెడీగా ఉంచుకోవాలి. వచ్చే 2-3 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి రాబడులను ఇస్తాయి. వినియోగ స్టాక్స్‌ అయిన హెచ్‌యూఎల్‌, మారికో, డాబర్‌, నెస్లే మంచి బెట్స్‌’’ అని గౌరవ్‌గార్గ్‌ తెలియజేశారు. 

 

అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ కారణంగా స్తబ్దుగా ఉన్నట్టు గార్గ్‌ పేర్కొన్నారు. చమురు ధరల్లో బలహీనత అంతర్జాతీయ ఆర్థిక రంగ వృద్ధి తగ్గుదలను తెలియజేస్తోందన్నారు. అలాగే బంగారం ధరలు పెరగడం అన్నది... ప్రస్తుత సమయంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాల్లో పెట్టుబడుల కోసం చూస్తున్నట్టు సంకేతాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం మన మార్కెట్లు బేర్‌ దశలో ఉన్నాయని వ్యాఖ్యానించడం అపరిపక్వమే అవుతుందన్నారు. ‘‘గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్లు మంచి రాబడులను ఇవ్వలేకపోయాయి. నిఫ్టీలో సగానికి పైగా స్టాక్స్‌ వాటి గరిష్టాల నుంచి 12-15 శాతం వరకు పడిపోయాయి. అయితే, ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టే చర్యలను ప్రభుత్వం ప్రకటించడం మార్కెట్లను ముందుకు తీసుకెళుతుంది. అందుకే మంచి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఆరంభించాలి’’ అని గార్గ్‌ సూచించారు. You may be interested

ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం..!

Saturday 24th August 2019

ఆటో సహా పలు రంగాలకు ప్రోత్సాహకాలు దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ పెంపు ఉపసంహరణ హెచ్‌ఎఫ్‌సీలకు అదనంగా రూ.20,000 కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు చౌకగా హౌసింగ్‌, ఆటో, రిటైల్‌ రుణాలు ఎంఎస్‌ఎంఈలకు 30 రోజుల్లోనే జీఎస్టీ రిఫండ్‌లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన  న్యూఢిల్లీ:- మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక

ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన బ్యాంకులు మనవే

Saturday 24th August 2019

అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన టాప్‌-10 బ్యాంకుల్లో 7 ‍బ్యాంకులు మన దేశానివే కావడం ఆశ్చర్యం కలిగించకమానదు. బ్లూంబర్గ్‌ డేటాను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మన బ్యాంకులకు ఇక ముందూ మరిన్ని గడ్డు రోజులు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మొండి బకాయిల భారాన్ని మన బ్యాంకులు మోస్తున్న విషయం విదితమే.   మన దేశ ఆర్థిక రంగం మందగమనంలోకి వెళ్లిన నేపథ్యంలో బ్యాంకులు ఎన్‌పీఏల పరంగా మరిన్ని సవాళ్లను

Most from this category