News


క్యూ3 ఎఫెక్ట్‌- టాటా కాఫీ, కమిన్స్‌ స్పీడ్‌

Wednesday 29th January 2020
Markets_main1580274922.png-31290

5 శాతం ఎగసిన షేర్లు
లాభాల్లో మార్కెట్లు

యాపిల్‌ ఇంక్‌ ఫలితాల జోష్‌తో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ.. లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగసి 41,214ను తాకగా.. నిఫ్టీ 80 పాయింట్లు బలపడి 12,136 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు టాటా కాఫీ, మరోపక్క నిరుత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ కమిన్స్‌ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో​ సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కమిన్స్‌ ఇండియా లిమిటెడ్‌ నామమాత్ర వృద్ధితో రూ. 200 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 4 శాతం క్షీణించి రూ. 1456 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 5 శాతం నీరసించి రూ. 216 కోట్లను తాకింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కమిన్స్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 614 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 653 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

టాటా కాఫీ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టాటా కాఫీ రూ. 25 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 122 శాతం వృద్ధి కాగా.. మొత్తం ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 501 కోట్లను అధిగమించింది. కాగా.. గ్రూప్‌ కంపెనీ టాటా కెమికల్స్‌కు చెందిన 1.6 లక్షల షేర్లను సెకండరీ మార్కెట్‌ ద్వారా బోర్డు విక్రయించినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా కాఫీ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 108 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. 
 



You may be interested

టీసీఎస్‌ మెడకు టాటాటెలి ఏజీఆర్‌ బకాయి గుదిబండ!

Wednesday 29th January 2020

నిధుల సమీకరణ యత్నాల్లో టాటాసన్స్‌ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టాటాటెలిసర్వీసెస్‌కు చెందిన రూ. 13823 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించేందుకు టాటాసన్స్‌ నిధులు సమకూర్చుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తమ గ్రూప్‌నకు చెందిన దిగ్గజ కంపెనీ టీసీఎస్‌పై టాటాసన్స్‌ ఎక్కువగా ఆధారపడనుందని తెలిపింది. ఏజీఆర్‌ బకాయిలపై వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో టాటాటెలి తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిఉంది. ఇందుకోసం టీసీఎస్‌ నుంచి నిధులు సమకూర్చుకోవాలని టాటాసన్స్‌ యోచిస్తోంది.

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదాయం రూ.7,308 కోట్లు

Wednesday 29th January 2020

 రూ.164 కోట్ల నికర లాభం  స్వల్పంగా తగ్గిన మొండి బకాయిల ప్రభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.681 కోట్ల నికర నష్టాలొచ్చాయని బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,356 కోట్ల నుంచి రూ.7,308 కోట్లకు పెరిగింది. తగ్గిన మొండి భారం... మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయి. గత

Most from this category