News


ఈ నెల 22 నుంచి సీఎస్‌బీ ఐపీఓ

Wednesday 20th November 2019
Markets_main1574220179.png-29714

  • 26న ముగింపు 
  • ప్రైస్‌బ్యాండ్‌ రూ.193-195
  • వచ్చే నెల 4న లిస్టింగ్‌
  • ఇష్యూ సైజు రూ.410 కోట్లు !

ముంబై: కేరళ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఎస్‌బీ బ్యాంక్‌(గతలో కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 22 (ఈ శుక్రవారం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26న ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.193-195ను సీఎస్‌బీ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు 1.97 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌’(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. కనీసం 75 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.406-410 కోట్లు సమీకరించాలని సీఎస్‌బీ బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెల 4న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ సంస్థలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 

ఈ బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టైన తర్వాత ఈ బ్యాంక్‌లో అత్యధిక వాటా ఉన్న సంస్థగా ఫెయిర్‌ఫాక్స్‌ కొనసాగుతుంది. ఫెయిర్‌ఫాక్స్‌కు 50.09 శాతం ఉంటుందని, 15 ఏళ్లలో ఈ వాటాను 15 శాతానికి తగ్గించుకుంటుందని సీఎస్‌బీ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మొత్తం 412 బ్రాంచ్‌లు, 290 ఏటీఎమ్‌లతో ఈ బ్యాంక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.



You may be interested

త్వరలో యురేకా ఫోర్బ్స్‌ లిస్టింగ్‌ !

Wednesday 20th November 2019

న్యూఢిల్లీ: ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ తన అనుబంధ సం‍స్థ, యురేకా ఫోర్బ్స్‌ను త్వరలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నది. వాటాదారులకు మరింత విలువను అందించడం లక్ష్యంగా యురేకా ఫోర్బ్స్‌ను లిస్టింగ్‌ చేయడం కానీ, లేదా ఈ కంపెనీలో కొంత వాటాను విక్రయించడానికి గానీ, లేదా ఈ రెండింటికి గానీ చేయడానికి ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తగిన ప్రణాళికలను రూపొందించడానికి యాజమాన్యానికి డైరెక్టర్ల

త్వరలోనే జియో చార్జీల పెంపు

Wednesday 20th November 2019

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర ట్యారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన టెలికం దిగ్గజాలైన వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారమే పెంపు ప్రకటన చేయగా.. ఒక రోజు తరువాత జియో కూడా

Most from this category