News


సీఎస్‌బీ బ్యాంక్‌ లిస్టింగ్‌...భేష్‌ !

Thursday 5th December 2019
Markets_main1575518700.png-30066

(అప్‌డేట్‌...)

  • ఇష్యూ ధర రూ.195
  • 41 శాతం లాభంతో రూ.275 వద్ద లిస్టింగ్‌
  • 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగింపు 

న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లోనూ, ముగింపులోనూ మెరుపులు మెరిపించాయి. ఇష్యూ ధర రూ.195తో పోల్చితే లిస్టింగ్‌లో 41 శాతం లాభాన్ని, ముగింపులో 54 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు పంచాయి. రూ.193-195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 87 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. బుధవారం సీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.195తో పోల్చితే 41 శాతం లాభంతో రూ. 275 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 57 శాతం లాభంతో రూ. 307 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 54 శాతం లాభంతో రూ.300 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 40.2 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 3.7 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌రూ.5,205 కోట్లకు చేరింది. ఈ ఐపీఓ ద్వారా ఈ బ్యాంక్‌ రూ.410 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ సంస్థలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి. You may be interested

18న జీఎస్‌టీ మండలి సమావేశం

Thursday 5th December 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమీక్షా సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.  అంచనాలకన్నా తక్కువ జీఎస్‌టీ వసూళ్లు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ పరిహారం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీ పరిహారం అంశాన్ని ఈ సమీక్షా సమావేశం చర్చిస్తుందని బుధవారం స్వయంగా

లాభాలతో ప్రారంభం

Thursday 5th December 2019

ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 40,988 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో 12,071 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category