News


సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓ... అదుర్స్‌

Wednesday 27th November 2019
Markets_main1574826332.png-29884

80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఇష్యూ 
వచ్చే నెల 4న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌

న్యూఢిల్లీ: సీఎస్‌బీ బ్యాంక్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూ)కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెల 22న మొదలై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 80 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రూ.193-195 ప్రైస్‌బ్యాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ సైజు రూ.410 కోట్లు. ఈ ఐపీఓలో భాగంగా మొత్తం 1.15 కోట్ల షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం 92 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో 1.97 కోట్ల ఈక్విటీ షేర్లను బ్యాంక్‌లో ఇప్పటికే వాటా ఉన్న కొన్ని కంపెనీలు విక్రయించాయి. 

గురువారం నాడు సీఎస్‌బీ బ్యాంక్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.184 కోట్లు సమీకరించింది. 

ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటస్‌ వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 27th November 2019

క్రితం రోజు కొత్త రికార్డులు నెలకొల్పిన తర్వాత లాభాల స్వీకరణకు గురైన స్టాక్‌ సూచీలు బుధవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 158 పాయింట్ల లాభంతో 40,979 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,069 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

ఎఫ్‌ అండ్‌ ఓ నుంచి టాటా మోటార్స్‌ ఔట్‌

Wednesday 27th November 2019

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్‌ నుంచి టాటా మోటార్స్‌ షేర్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తొలగిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 31 (ఫిబ్రవరి డెరివేటివ్స్‌ సిరీస్‌) నుంచి టాటా మోటార్స్‌, ఎన్‌బీసీసీ, డిష్‌టీవీ, క్యాస్ట్రాల్‌ ఇండియాలు షేర్లను ఈ ఎక్స్చేంజ్‌లు తొలగిస్తున్నాయి. వచ్చే నెల 23 నుంచి సెన్సెక్స్‌ నుంచి కూడా టాటా మోటార్స్‌ను తీసివేస్తున్న విషయం తెలిసిందే. 

Most from this category