News


కరోనా షాక్‌-3 నెలల కనిష్టానికి చమురు

Saturday 25th January 2020
Markets_main1579928721.png-31195

చమురుకు వైరస్‌ ఫీవర్‌!
వారాంతాన 1.4 శాతం క్షీణించిన ధరలు
గత వారం నికరంగా 7.5 శాతం పతనం

చైనాలోని ఉహాన్‌లో తలెత్తిన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వార్తలు ముడిచమురు ధరలను చల్లబరుస్తున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు విదేశీ మార్కెట్లో ధరలు వెనకడుగు వేశాయి. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.35 డాలర్లు(2.2 శాతం) క్షీణించి 60.69 డాలర్ల వద్ద ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 1.4 డాలర్లు(2.5 శాతం) పతనమై 54.19 డాలర్ల వద్ద స్థిరపడింది.  వెరసి గత వారం నికరంగా చమురు ధరలు 7.5 శాతం పతనమయ్యాయి. దాదాపు 3 నెలల కనిష్టానికి చేరాయి. ఇంతక్రితం అక్టోబర్‌ 31న మాత్రమే బ్రెంట్‌తోపాటు.. నైమెక్స్‌ బ్యారల్‌ ఈ ధరలలో ట్రేడైనట్లు విశ్లేషకులు తెలియజేశారు.

అమెరికాలోనూ
ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్న కరోనా వైరస్‌ 800 మందికి సోకినట్లు చైనా తాజా గణాంకాలు విడుదల చేసింది. మరోపక్క కరోనా వైరస్‌కు సంబంధించి ఇల్లినాయిస్‌లో రెండో కేసు నమోదైనట్లు అమెరికా ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ వైరస్‌ పలు దేశాలకు విస్తరించే అవకాశముందన్న ఆందోళనలు ఇటీవల వ్యాపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా మందగించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా చమురుకు డిమాండ్‌ క్షీణించవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు చమురు సరఫరాలు ఊపందుకోనున్న వార్తలు సైతం ధరలను దెబ్బతీస్తున్నట్లు వివరించారు.

షేల్‌ ఎఫెక్ట్‌
ఫిబ్రవరిలో షేల్‌ చమురు ఉత్పత్తి రోజుకి 22,000 బ్యారళ్లమేర పెరిగి 9.2 మిలియన్‌ బ్యారళ్లకు చేరినట్లు గత వారం మధ్యలో అమెరికా ఇంధన శాఖ(EIA) వెల్లడించింది. దీనికితోడు ఆయిల్‌ ఫీల్డ్‌ సర్వీసుల సంస్థ బేకర్‌ హ్యూస్‌ ఈ వారంలో 3 రిగ్గులు జతకావడంతో మొత్తం చమురు రిగ్గుల సంఖ్య 676కు చేరినట్లు తాజాగా వెల్లడించింది. కాగా.. గతంలో అంటే 2014లో తలెత్తిన ఎబోలా, 2003లో కనిపించిన సార్స్‌ తదితరాల మాదిరిగా ప్రస్తుతం కరోనా వైరస్‌ పలు దేశాలను ఆందోళనకు లోనుచేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ క్షీణించనున్న అంచనాలు బలపడుతున్నాయి. ఇది ధరలను దెబ్బతీస్తున్నట్లు ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు క్షీణించడం దేశీయంగా సానుకూల అంశమని ఆర్థికవేత్తలు తెలియజేస్తున్నారు. దీంతో దిగుమతులు బిల్లు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. ఇది దేశీ కరెన్సీకి బలాన్నివ్వనున్నట్లు వివరించారు.



You may be interested

కోల్‌ ఇండియా కొత్త ప్రణాళికలతో సిద్ధం

Saturday 25th January 2020

కొన్నేళ్లగా అనేక సవాళ్లను ఎదుర్కోన్న కోల్‌ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కిందటేడాది దేశవ్యాప్తంగా భారీ వర్షపాతం, నవంబర్‌లో సంభవించిన అకాల వర్షాలతో బొగ్గు ఉత్పత్తి, సరఫరాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కోల్‌ ఇండియా ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయింది. గతేడాదిలో ఇండియా బొగ్గు వినియోగం 5.83శాతం క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  కోల్‌ ఇండియా దేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారకు అయినప్పటికీ అనేక

ఆదాయపన్ను తగ్గింపు సాధ్యమే!

Saturday 25th January 2020

సీఎల్‌ఎస్‌ఏ అంచనా రాబోయే బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపన్నును ప్రభుత్వం తగ్గించవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఐటీ తగ్గింపుద్వారా వృద్ధి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం యత్నించవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపు కన్జూమర్‌ కంపెనీలకు మేలు చేయవచ్చని పేర్కొంది. ఆదాయపన్ను తగ్గింపుతో ఐటీ కలెక‌్షన్లు 20 శాతం(దాదాపు లక్షకోట్ల రూపాయలు) తగ్గవచ్చని అంచనా వేసింది. అయితే కొత్త ఆదాయ వర్గాలను పన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్ను కట్టేవాళ్లు పెరగడంతో వసూళ్ల నిజ తగ్గింపు ఆర్థికసంవత్సరాంతానికి

Most from this category