News


చమురుకు వైరస్‌ ఫీవర్‌!

Thursday 23rd January 2020
Markets_main1579753245.png-31125

2 శాతం క్షీణించిన చమురు ధరలు
7 వారాల కనిష్టానికి బ్రెంట్‌ చమురు

చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. వెరసి బుధవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.38 డాలర్లు(2.1 శాతం) క్షీణించి 63.21 డాలర్లను తాకింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 2.8 శాతం పతనమై 56.74 డాలర్లకు చేరింది. 
నేలచూపుతోనే
గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌ ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్‌ బ్యారల్‌ 1.3 శాతం నీరసించి 62.37 డాలర్ల వద్ద ట్రేడవుతుంటే.. నైమెక్స్‌ బ్యారల్‌ సైతం​1.6 శాతం వెనకడుగుతో 55.85 డాలర్ల వద్ద కదులుతోంది. వెరసి వరుసగా మూడో రోజు చమురు ధరలు డీలాపడ్డాయి. ఫలితంగా విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 7 వారాల కనిష్టానికి చేరాయి. ఇంతక్రితం​డిసెంబర్‌ 3న చమురు ధరలు ఈ స్థాయిలో ట్రేడయ్యాయి. ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతున్న కరోనా వైరస్‌ కారణంగా చమురుకు డిమాండ్‌ క్షీణించనున్న అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. దీనికితోడు చమురు సరఫరాలు పెరగడం కూడా ప్రభావం‍ చూపుతున్నట్లు వివరించాయి.  
షేల్‌ ఎఫెక్ట్‌
ఫిబ్రవరిలో షేల్‌ చమురు ఉత్పత్తి రోజుకి 22,000 బ్యారళ్లమేర పెరిగి 9.2 మిలియన్‌ బ్యారళ్లకు చేరినట్లు తాజాగా అమెరికా ఇంధన శాఖ(EIA) వెల్లడించింది. నైమెక్స్‌ చమురుపై ఈ వార్తలు ప్రతికూల ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు క్షీణించడం దేశీయంగా సానుకూల అంశమని ఆర్థికవేత్తలు తెలియజేశారు. దీంతో దిగుమతులు బిల్లు తగ్గనున్నట్లు పేర్కొన్నారు. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 23rd January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్లు కర్ణాటక బ్యాంక్‌: మూలధన సమీకరణ ప్రతిపాదనలను కర్ణాటక బ్యాంక్‌ బోర్డు జనవరి 27న పరిశీలించనుంది. రేమండ్‌: క్యూ3 నికర లాభం పెరిగి రూ.43 కోట్లనుంచి రూ.197 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది క్యూ3లో ఉన్న నికర ఆదాయం రూ.1,675 కోట్లనుంచి 12.5 శాతం పెరిగి రూ.1,885 కోట్లకు చేరింది. సియట్‌: సియట్‌ క్యూ3 నికర లాభం దాదాపు యదాతధంగా రూ.53 కోట్లుగా నమోదైంది. వార్షిక

యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీకి ఫలితాల జోష్‌

Thursday 23rd January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ షేర్లు గురువారం పాజిటివ్‌గా దూసుకుపోయాయి. యాక్సిస్‌ బ్యాంకు షేరు రూ. 725 వద్ద ఆరంభమై రూ. 737.55 గరిష్ఠాన్ని తాకి రూ. 730 వద్ద కదలాడుతోంది. గత క్లోజింగ్‌తో పోలిస్తే షేరు దాదాపు 2.5 శాతం లాభపడింది. ఎల్‌అండ్‌టీ షేరు రూ. 1307 వద్ద ఆరంభమై రూ. 1336.90 వద్ద గరిష్ఠాన్ని తాకి ప్రస్తుతం రూ. 1335 వద్ద

Most from this category