News


61 డాలర్ల పైకి క్రూడ్‌

Monday 4th November 2019
Markets_main1572846960.png-29329

యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఈ నెలలో ఖరారు కానుందనే అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 3 శాతానికి పైగా లాభపడిన చమురు ధరలు, సోమవారం ఆసియాలో లాభాల స్వీకరణ ఫలితంగా  గరిష్టస్థాయి నుంచి తగ్గాయి. ఉదయం 10.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.55 శాతం నష్టపోయి బారెల్‌ 61.35 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.59 శాతం నష్టపోయి బారెల్‌ 55.87 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. యుఎస్‌ క్రూడ్‌ ఆయిల్‌ డేటా విడుదల కావడంతో పాటు, యురోప్‌, యుఎస్‌ స్థూల ఆర్థిక డేటా వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని యాక్సి ట్రేడర్, ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. ‘యుఎస్‌-‍చైనా మధ్య వాణిజ్య చర్చలు మెరుగుపడడం చమురు మార్కెట్‌లో సెంటిమెంట్‌ను బలపరుస్తున్నప్పటికి, స్థూల ఆర్థిక డేటా మార్కెట్‌లను మెప్పించే విధంగా ఉండాలని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు’ అని ఆయన అన్నారు. కాగా యురోపియన్‌ యూనియన్‌, యుఎస్‌ దేశాల స్థూల ఆర్థిక సమాచారం ఈ రోజు వెలువడనుంది. యుఎస్ చమురు రిగ్గింగ్‌ వరుసగా రెండవ వారం పడిపోవడంతోపాటు, యుఎస్‌ ఉద్యోగ డేటా బలపడడంతో గత వారం చమురు ధరలు లాభపడ్డాయి. దీంతోపాటు కెనడా నుంచి యుఎస్‌కు అధిక మొత్తంలో క్రూడ్‌ను సరఫరా చేసే పైప్‌లైన్‌ మూతపడడంతో కూడా చమురు ధరలు లాభపడ్డాయి. 



You may be interested

ఇన్ఫీ షేరు 6 శాతం అప్‌

Monday 4th November 2019

ఆరోపణలపై ఆధారాల్లేవన్న కంపెనీ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేరు సోమవారం మధ్యాహ్న ట్రేడింగ్‌ సమయానికి అనూహ్యంగా కోలుకొని దాదాపు 6 శాతం పైగా దూసుకుపోయింది. మునుపటి క్లోజింగ్‌ 687.90రూపాయల దిగువన ఆరంభమైన షేరు ఒకదశలో 678 రూపాయల వరకు పతనమైంది. అయితే కంపెనీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాల్లేవన్న ప్రకటనతో షేరు ఒక్కసారిగా లాభాల్లోకి మరలింది. అలా స్పీడుగా దాదాపు 6.5 శాతం లాభపడి రూ.732 వద్ద

ఏడాదిగా ఎంఎఫ్‌ల ఫేవరెట్‌ షేర్లివే!

Monday 4th November 2019

నాలుగు త్రైమాసికాలుగా వీటిలో వాటాలు పెంచుకుంటున్న ఫండ్స్‌ ఏడాది కాలంగా మార్కెట్లు పడుతూ లేస్తూ పయనం సాగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫండ్‌ మేనేజర్లు కొన్ని నాణ్యమైన స్టాకులను తమ పోర్టుఫోలియోల్లో పెంచుకుంటూ పోతున్నారు. వీటిలో నాణ్యమైన ఏడు స్టాకులను వివిధ పారామీటర్ల ఆధారంగా నిపుణులు ఎంపిక చేస్తున్నారు.  ఇలా ఎంఎఫ్‌లు ఏడాదిగా మక్కువ చూపుతున్న ఏడు స్టాకుల వివరాలు ఇలా ఉన్నాయి... 1. ఎల్‌అండ్‌ టీ: బలమైన ఎర్నింగ్స్‌ నమోదు చేస్తున్నా,

Most from this category