News


చమురు డీలా- పసిడి ప్లస్‌

Monday 16th March 2020
Markets_main1584338060.png-32502

3-2 శాతం మధ్య చమురు ధరలు డౌన్‌
2 శాతం పెరిగిన కామెక్స్‌ గోల్డ్‌ ధరలు

కోవిడ్‌-19 ధాటికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా వడ్డీ రేట్లను ఏకంగా 1 శాతంమేర కట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నీరసించగా.. పసిడి స్వల్పంగా మెరుస్తోంది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ఉదయం 11 ప్రాంతంలో 3.2 శాతం పతనమైంది. 32.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 2 శాతం క్షీణించి 31.14 డాలర్ల వద్ద కదులుతోంది. అయితే సంక్షోభ సమయాలలో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం దాదాపు 2 శాతం పుంజుకుని 1544 డాలర్ల సమీపానికి చేరింది. ఇక ‍స్పాట్‌ గోల్డ్‌ ధర సైతం 0.7 శాతం బలపడి 1540 డాలర్లను అధిగమించింది.

ఫెడ్‌ ఎఫెక్ట్‌
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఆదివారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రాతిపదికన వడ్డీ రేట్లను జీరో స్ఠాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 0-0.25 శాతానికి చేరాయి. తద్వారా 2008 తదుపరి తిరిగి జీరో స్థాయికి చేరాయి. ఇటీవలే కోవిడ్‌-19 ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లను 0.5 శాతంమేర కట్‌ చేసిన ఫెడ్‌ తాజాగా పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్లను దాదాపు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.  వెరసి ఈక్విటీ మార్కెట్ల ఫ్యూచర్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తగా.. ముడిచమురు ధరలు వెనకడుగు వేశాయి. పసిడి స్వల్పంగా పుంజుకుంది. ధరలను నిలిపే బాటలో ఒపెక్‌ ప్రతిపాదించిన ఉత్పత్తిలో తాజా కోతలకు రష్యా అంగీకరించకపోవడంతో గత వారం చమురు ధరలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెరసి 2008 తదుపరి గత వారం చమురు ధరలు ఏకంగా 25 శాతం పడిపోయాయి.



You may be interested

52 వారాల కనిష్టానికి పడిపోయిన షేర్లు

Monday 16th March 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 271 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏడీసీ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అద్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగ్రి టెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), అక్స్‌ ఆఫ్టిఫైబర్‌, ఆంధ్రా సిమెంట్స్‌, అన్సాల్‌ హౌసింగ్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్చిస్‌, ఆర్కోటెక్‌,

స్వల్వంగా పెరిగిన పసిడి!

Monday 16th March 2020

గతవారంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు వారాంతంలో రూ.1800 మేర పడిపోయాయి. సోమవారం మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.624 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,972.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోను 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,540 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్లను పూర్తిగా

Most from this category