News


నష్టాల్లో చమురు ధరలు

Wednesday 20th November 2019
Markets_main1574225190.png-29725

యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో పాటు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వలన అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో గత రెండు సెషన్‌లలో చమురు ధరలు పతనమయ్యాయి. ఈ పతనాన్ని కొనసాగిస్తు బుధవారం సెషన్లో కూడా చమురు ధరలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9.46 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.10 శాతం తగ్గి బ్యారెల్‌కు 60.81 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.03 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 55.33 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత రెండు సెషన్లను కలిపి బ్రెంట్‌ క్రూడ్‌ 3.8 శాతం పడిపోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 4.3 శాతం నష్టపోయింది. యుఎస్‌ చమురు నిల్వలు నవంబర్‌ 15తో ముగిసిన వారానికి గాను 60 లక్షల బ్యారెల్స్‌ పెరిగాయని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టీట్యూట్‌(ఏపీఐ) మంగళవారం ప్రకటించింది. కానీ ఈ పెరుగుదల 15 లక్షల బ్యారెల్స్‌ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) ప్లస్‌ డిసెంబర్‌ 5-6 తేదీలలో జరగనున్న సమావేశంలో, చమురు ఉత్పత్తి కోత నిర్ణయంపై రష్యా విముఖంగా ఉందనే వార్తలు రాయిటర్సలో వెలువడ్డాయి. ఈ అంశంతో నష్టాల్లోకి జారుకున్న  చమురు ధరలు, పెరిగిన యుఎస్‌ చమురు నిల్వల వలన మరింత నష్టపోతున్నాయి. ‘డిసెంబర్‌లో జరిగే ఒపెక్‌ ప్లస్‌ సమావేశంలో, చమురు ఉత్పత్తి కోతకు రష్యా విముఖంగా ఉండడం చమురు ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’ అని ఓండా సీనియర్‌ ఎనలిస్ట్‌ ఎడ్వార్డ్‌ మోయా అన్నారు. ‘ఏపీఐ మంగళవారం ప్రకటించిన చమురు ధరల పెరుగుదలను, ఈఐఏ(ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) కూడా దృడపరిస్తే ఆయిల్‌ ధరలు మరింత పతనమవుతాయి’ అని ఆయన అన్నారు. కాగా యుఎస్‌ చమురు నిల్వలపై డేటాను ఈఐఏ బుధవారం విడుదల చేయనుంది.



You may be interested

ఆల్‌టైం గరిష్ఠానికి సెన్సెక్స్‌, 12,000 పైన నిఫ్టీ

Wednesday 20th November 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ఇం‍డ్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ చేయడంతో బుధవారం సెషన్లో సెన్సెక్స్‌ కొత్త గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 10.31 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2721.63 పాయింట్లు లాభపడి 40743.33 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో 40,469.70 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్‌, బుధవారం సెషన్లో 40,768.83 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అదేవిధంగా గత కొన్ని సెషన్‌లలో  కీలక నిరోధంగా పనిచేస్తున్న 12,000 స్థాయిని నిఫ్టీ బుధవారం

మిడ్‌క్యాప్స్‌పై విదేశీ ఫండ్స్‌ మోజు

Wednesday 20th November 2019

కొనుగోళ్లు పెంచుతున్న ఎఫ్‌పీఐలు రెండు సంవత్సరాలుగా కేవలం లార్జ్‌క్యాప్స్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుపుతూవస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా చిన్న స్టాకుల వైపు చూస్తున్నారు. ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద లభించే చిన్న స్టాకులు ఇచ్చే లాభాలను అందిపుచ్చుకోవడానికి ఎఫ్‌పీఐలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యు2లో ఎఫ్‌పీఐలు దాదాపు 60కి పైగా మిడ్‌క్యాప్స్‌లో వాటాలు పెంచుకున్నాయి. అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అధార్టీ, ఈస్ట్‌స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, యూరో పసిఫిక్‌ గ్రోత్‌ ఫండ్‌, ఫిడిలిటీ, గవర్నమెంట్‌ పెన్షన్‌

Most from this category