News


10 శాతం పడిపోయిన చమురు ధరలు

Saturday 7th March 2020
Markets_main1583562511.png-32345

ఉత్పత్తిలో కోతలకు రష్యా విముఖం
నాలుగేళ్ల కనిష్టానికి  కనిష్టానికి చమురు ధరలు


రోజురోజుకీ నీరసిస్తున్న చమురు ధరలకు బలాన్నిచ్చే బాటలో ఉత్పత్తిలో కోతలను అమలు చేసే ప్రణాళికలకు రష్యా నో చెప్పడంతో వారాంతాన ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏకంగా 10 శాతం పతనమయ్యాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 9.4 శాతం(4.72 డాలర్లు) పడిపోయి 45.27 డాలర్ల వద్ద ముగిసింది. ఇది 2017 జులై తదుపరి  కనిష్టంకాగా.. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు సైతం బ్యారల్‌ 10 శాతం(4.62 డాలర్లు) తిరోగమించి 41.28 డాలర్లను తాకింది. వెరసి నాలుగేళ్ల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం ఏప్రిల్‌ 2016లో నైమెక్స్‌చమురు ధరలు ఈ స్థాయిలో ముగిశాయి. 

ఉత్పత్తిలో కోతలు
చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌) సమాఖ్య ధరలకు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తూ వస్తున్న విషయం విదితమే. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ క్షీణిస్తున్న నేపథ్యంలో తాజాగా వియత్నాంలో సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్‌ సమాశాన్ని నిర్వహించింది. అయితే ఇటీవల పడిపోతున్న చమురు ధరలకు దన్నుగా  సౌదీ అరేబియా ప్రతిపాదించిన మరిన్ని కోతలకు రష్యా తిరస్కరించింది. రష్యా ఒపెక్‌లో భాగస్వామికానప్పటికీ ప్రపంచ చమురు ఉత్పత్తిలో ప్రస్తావించదగ్గ వాటాను కలిగి ఉంది. నిజానికి రోజుకి 2.2 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను ఒపెక్‌ తదితర దేశాలు అమలు చేస్తున్నాయి. మార్చివరకూ ఇది కొనసాగనుంది. వీటికి అదనంగా మరో 1.5 మిలియన్‌ బ్యారళ్లమేర కోతలకు సౌదీ ప్రతిపాదించింది. దీనిలో 0.5 మిలియన్‌ బ్యారళ్లమేర రష్యా ఉత్పత్తిని తగ్గించవలసి ఉంటుంది. ఇందుకు రష్యా అంగీకరించనట్లు వార్తలు వెలువడ్డాయి.



You may be interested

కరోనా కాటుకు కుంటుపడ్డ రంగాలు!

Saturday 7th March 2020

      గత నెలరోజులుగా ఎవరినోటా విన్నా ఒకటే మాట వినిపిస్తోంది అదే కరోనా(కోవిడ్‌-19). చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తూ వేగంగా వ్యాప్తి చెందుతూ పోతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో కరోనా భయంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన పౌరులు, పర్యాటకుల వల్ల ఇండియాలో కూడా

రూ.44,000 వద్ద స్థిరంగా పసిడి

Saturday 7th March 2020

అంతర్జాతీయ మార్కెట్‌లో అన్చితి పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా రూపాయి బారీగా బలహీనపడడం, కరోనా వైరస్‌ వ్యాప్తి వంటి అంశాలు కారణంగా బంగారం ధర గత ఐదురోజులుగా పెరగుతూ వస్తూ శుక్రవారం జీవిత కాలగరిష్టానికి చేరింది. ఒకే రోజు రూ.1000 పెరిగిన బంగారం శనివారం స్వల్పంగా తగ్గింది. మల్టీకమోడిటీ మార్కెట్‌లో రూ.465 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.44,158.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 1,692 డాలర్లకు పెరిగిన పసిడి మార్కెట్‌

Most from this category