News


13 నెలల కనిష్టానికి చమురు ధరలు

Tuesday 4th February 2020
Markets_main1580788461.png-31487

బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 4 శాతం పతనం
50 డాలర్ల దిగువకు చేరిన నైమెక్స్‌ క్రూడ్‌

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు డీలాపడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనా మరింత ఆర్థిక మందగమనంలోకి జారుకోవచ్చన్న అంచనాలు చమురు ధరలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాసహా ఇతర దేశాలలోనూ కరోనా జాడలు కనిపిస్తుండటంతో చమురుకు డిమాండ్‌ పడిపోవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. లండన్‌ మార్కెట్లో సోమవారం బ్రెంట్‌ బ్యారల్‌ దాదాపు 4 శాతం(2.2 డాలర్లు) పతనమైంది. 55 డాలర్ల దిగువన 54.45 డాలర్ల వద్ద ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు సైతం​దాదాపు 2 డాలర్లు క్షీణించి  49.91ను తాకింది. 2019 జనవరి తదుపరి ఇవి కనిష్టాలుకాగా.. నైమెక్స్‌ బ్యారల్‌ 50.12 డాలర్ల వద్ద స్థిరపడింది.

స్వల్ప రికవరీ
ప్రస్తుతం బ్రెంట్‌ బ్యారల్‌ 0.6 శాతం పుంజుకుని 54.76 డాలర్ల వద్ద కదులుతోంది. ఈ బాటలో న్యూయార్క్‌ బ్యారల్‌ సైతం 0.75 శాతం బలపడి 50.48 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చైనా నుంచి చమురుకు డిమాండ్‌ క్షీణించినట్లు తాజా గణాంకాలు పేర్కొన్నాయి. రోజుకి 3 మిలియన్‌ బ్యారళ్లమేర చమురు డిమాండ్‌ తగ్గినట్లు తెలియజేశాయి. ఇది చైనా మొత్తం చమురు వినియోగంలో 20 శాతానికి సమానంకావడం గమనార్హం! కాగా.. 2008-09 ఆర్థిక సంక్షోభం తదుపరి ఈ స్థాయిలో చమురుకు డిమాండ్‌ పడిపోవడం ఇదే తొలిసారని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. దీంతో చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌) ఉన్నట్లుండి సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికలు ప్రకటించాయి. చమురు ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా  ధరలను నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 



You may be interested

కార్ల పండుగ వచ్చేస్తోంది!!

Tuesday 4th February 2020

ఈ నెల 7 నుంచి 12 వరకూ ఆటోఎక్స్‌పో... ఎలక్ట్రిక్‌ వాహనాలపైనే అత్యధికంగా దృష్టి... రెండేళ్లకొకసారి జరిగే వాహన పండుగకు రంగం సిద్ధమైంది. పర్యావరణ స్పృహ బాగా పెరిగిన నేపథ్యంలో ఈసారి ఈ ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు బాగా ఉండగలదని నిపుణులు భావిస్తున్నారు. మందగమనం కారణంగా వాహన విక్రయాలు కుదేలయ్యాయని, ఆ ఆటో ఎక్స్‌పో వినియోగదారుల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారం (ఈ నెల 7వ

300 పాయింట్ల గ్యాప్‌తో సెన్సెక్స్‌ ప్రారంభం

Tuesday 4th February 2020

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం 78 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ  దేశీయ మార్కెట్‌ మంళవారం లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 40,167.86 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,786.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 2శాతం నష్టపోయి 50డాలర్లకి దిగువకు వచ్చింది. ఈ ధరలు 13నెలల కనిష్టస్థాయి

Most from this category