STOCKS

News


డిమాండ్‌ ఆందోళనలు..తగ్గిన చమురు

Tuesday 24th September 2019
Markets_main1569300799.png-28513

  సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో చమురు ధరలు గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. అయినప్పటికి యూరోప్‌ దేశాలు, జపాన్‌ విడుదల చేసిన తయారిరంగం డేటా బలహీనంగా ఉండడంతో చమురు మార్కెట్‌లో డిమాండ్‌ భయాలు తిరిగి పుంజుకున్నాయి. ఫలితంగా మంగళవారం చమురు నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 9.57 సమయానికి  బ్రెంట్‌ క్రూడ్‌ 0.66 శాతం నష్టపోయి బారెల్‌ 63.31 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.53 శాతం నష్టపోయి బారెల్‌ 58.33 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘డిమాండ్‌ దృక్పథంపై ఇన్వెస్టర్ల దృష్ఠి తిరిగి మరలింది’  అని సీఎంసీ మార్కెట్స్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌ మైఖెల్‌ మెక్‌కార్తీ అన్నారు. కీలకమైన యూరోప్‌, జపాన్‌ల తయారిరంగ డేటా బలహీనంగా ఉండడంతో చమురు డిమాండ్‌పై ఆందోళనలు పెరిగాయని ఆయన అన్నారు. ‘అందువలనే డబ్యూటీఐ కంటే బ్రెంట్‌ క్రూడ్‌లో అధిక డౌన్‌వార్డ్‌ ఒత్తిళ్లను మేము చూస్తున్నాం’ అని వివరించారు. 
  సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో సౌదీ చమురు ఉత్పత్తి సగానికిపైగా పడిపోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఇప్పటికి క్రూడ్‌ ధరలు గరిష్ఠ స్థాయిల దగ్గరే ఉండడం గమనార్హం. డ్రోన్‌ దాడి వలన కోల్పోయిన చమురు ఉత్పత్తిలో, 75 శాతం ఉత్పత్తిని వచ్చే వారంలోపు సౌదీ అరేబియా పూర్తీ పరిమాణంతో పునరుద్ధరిస్తుందని రాయిటర్స్‌ పేర్కొంది. కానీ ద్వంసంమైన ప్లాంట్‌లను తిరిగి పనరుద్ధరించడానికి సౌదీకి ఊహించినదానికంటే ఎక్కువ సమయం పడుతుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సోమవారం పేర్కొనడం గమనార్హం. దీనితోపాటు డ్రోన్‌ దాడికి ఇరాన్‌ కారణమని యుఎస్‌ చేస్తున్న ఆరోపణలకు బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా మద్ధతిస్తున్నాయి. ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతేకాకుండా గత వారానికి(సెప్టెంబర్‌ 20తో ముగిసిన) సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు 800,000 బారెల్లు పడిపోతాయని రాయిటర్స్‌ పోల్‌ అంచనావేసింది. ఈ అంశాలన్ని చమురు ధరలకు మద్ధతునిచ్చేవే. కాగా యుఎస్‌ చమురు నిల్వలకు సంబంధించి అధికారిక డేటాను అమెరికన్‌ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం విడుదల చేయనుండగా, ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం విడుదల చేయనుంది.You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం అప్‌

Tuesday 24th September 2019

రెండురోజుల భారీ ర్యాలీ తర్వాత మంగళవారం మార్కెట్‌లో లాభాల స్వీకరణ చోటుచేసుకుంటుంది. ఫలితంగా ఉదయం 10.50 సమయానికి నిఫ్టీ 22.20 పాయింట్లు నష్టపోయి 11,578.00 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 43.15 పాయింట్లు కోల్పోయి 39,046.88 పాయిం‍ట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడయ్యి మార్కెట్‌ నష్టాలను తగ్గింస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఉదయం 10.50 సమయానికి 4.59 శాతం లాభపడి రూ. 1,296.15 వద్ద

ఇండియన్‌ బ్యాంకు కస్టమర్లకు మ్యాక్స్‌బూపా పాలసీలు

Tuesday 24th September 2019

న్యూఢిల్లీ: ప్రముఖ బీమా సం‍స్థ మ్యాక్స్‌బూపా, ప్రభుత్వరంగంలోని ఒకానొక అతిపెద్ద ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఇండియన్‌ బ్యాంకు పరిధిలోని 4 కోట్ల ఖాతాదారులకు సమగ్ర వైద్య బీమా ఉత్పత్తులను ఆఫర్‌ చేయనున్నట్టు మ్యాక్స్‌బూపా ప్రకటించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా భిన్నమైన వైద్య బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 

Most from this category