News


స్వల్ప లాభాల్లో క్రూడ్‌

Wednesday 16th October 2019
Markets_main1571201747.png-28916

   బ్రెక్సిట్‌ ఒప్పందం సజావుగా సాగుతుందనే అంచనాలతోపాటు, ఒపెక్‌(చమురు ఎగుమతి, దిగుమతి దేశాలు), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తికి మరింత కోత విధించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో చమురు ధరలు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వలన ఈ లాభాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఉదయం 9.47 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.29 శాతం లాభపడి బారెల్‌ 58.91 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.25 శాతం లాభపడి బారెల్‌ 52.94 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘ఆయిల్‌ డిమాండ్‌కు ప్రమాదంగా ఉన్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌, బ్రెక్సిట్‌ అంశాలు కొంత సరళతరం అవ్వడంతో చమురు ధరలు లాభపడుతున్నాయి’ అని ఓండా సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకులు, ఎడ్వార్డ్‌ మోయా అన్నారు. ‘విస్తృత స్థాయిలో వాణిజ్య ఒప్పందం సమీప కాలంలో కుదిరే అవకాశం లేనప్పటికి, యుస్‌-చైనా ట్రేడ్‌వార్‌ రిస్క్‌ కొంత తగ్గుముఖం పట్టింది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో పాటు బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌(ఈయూ) మధ్య బ్రెక్సిట్‌కి సంబంధించి చివరి చర్చలు గత రాత్రి జరిగాయి. అంతేకాకుండా ఈయూ సభ్యదేశాల నాయకుల మధ్య ఈ వారం సమావేశం జరగనుండడం గమనార్హం. కానీ బ్రెక్సిట్‌ అంశం ఇంకా ఆస్పష్టంగానే ఉందని పరిశీలకులు తెలిపారు. బ్రెక్సిట్‌ ఒప్పందం జరగకపోయిన లేదా బ్రెక్సిట్‌ సజావుగా జరిగిన అది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సహాయపడుతుందని, ఫలితంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
  ఈ అంశాలతో పాటు చమురు ధరలను స్థీరీకరించేందుకు ఒపెక్‌, ఒపెక్‌ మిత్ర దేశాలు సరియైన చర్యలను తీసుకుంటాయని ఒపెక్‌ సెక్రటరీ జనరల్‌ మహ్మద్‌ బార్కిండో అన్నారు. ఇప్పటికే ఒపెక్‌, రష్యా, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు రోజుకు 12 లక్షల బారెళ్లు చమురు ఉత్పత్తి కోతను అమలు చేస్తున్నాయి. అయినప్పటికి యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలపై ఒత్తిడి ఉంది. యుఎస్‌ చమురు నిల్వలు వరుసగా ఐదవ వారంలో కూడా పెరిగే అవకాశం ఉందని రాయిటర్స్‌ పోల్‌ తెలిపింది. కాగా వీటిపై అధికారిక డేటాను అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టీ‍ట్యూట్‌ బుధవారం ప్రకటించనుండగా, యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గురువారం విడుదలన చేయనుంది. ప్రభుత్వ సెలవు దినం కారణంగా ఈ డేటా ఒక రోజు ఆలస్యంగా వెలువడనున్నాయి. 



You may be interested

పాజిటివ్‌గా రియల్టీ..సన్‌టెక్‌ 4% అప్‌!

Wednesday 16th October 2019

 బ్యాంకులు రుణ మేళాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలను అందిస్తుండడంతో పాటు, మరోదపా రేట్ల కోత ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి దేశీయ రియల్టీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా సానుకూలంగా ఉండడంతో బుధవారం ఉదయం 10.39 సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.46 శాతం లాభపడి 257.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్‌టెక్‌

అమెరికాతో వాణిజ్య వివాదాల్లేవు

Wednesday 16th October 2019

ఉన్నది కొన్ని అభిప్రాయ భేదాలే ఱైల్వేలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢిల్లీ: అమెరికాతో భారత్‌కు ఎటువంటి వాణిజ్య వివాదాల్లేవని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఉన్నది కేవలం కొన్ని అభిప్రాయ భేదాలేనన్నారు. ఇరు దేశాలు గణనీయ స్థాయిలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కలిగి ఉ‍న్నాయని చెప్పారు. భారత ఇంధన సదస్సులో మంత్రివర్గ ప్యానెల్‌ చర్చ సందర్భంగా గోయల్‌ మాట్లాడారు.

Most from this category