News


స్టాక్స్‌ బాటలో చమురు ధరలకూ జోష్‌

Tuesday 3rd March 2020
Markets_main1583209236.png-32235

5 శాతం జంప్‌చేసిన చమురు ధరలు
ఒపెక్‌, తదితర దేశాల ఉత్పత్తి కోతపై అంచనాలు
కేంద్ర బ్యాంకుల సహాయక ‍ప్యాకేజీలపై ఆశలు

ఈ కేలండర్‌ ఏడాదిలో తొలిసారి ముడి చమురు ధరలు 4-5 శాతం స్థాయిలో జంప్‌చేశాయి. కరోనా సమస్యలకు చెక్‌ పెట్టేవిధంగా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలను ప్రకటించనున్న అంచనాలు చమురు ధరలకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకోనున్న చర్యలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనున్న ఆశలు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. దీనికితోడు ఈ నెలలో సమావేశంకానున్న ఒపెక్‌, రష్యా తదితర దేశాలు చమురు ధరలను నిలబెట్టేందుకు ఉత్పత్తిలో కోతలను పెంచే వీలున్నట్లు వెలువడిన వార్తలు సైతం​సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇటీవల పలు దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయనున్న ఆందోళనలు పెరగడంతో ఇటీవల చమురు ధరలు బేర్‌మంటున్న విషయం విదితమే. దీంతో గత వారాంతానికల్లా బ్రెంట్‌ చమురు 50 డాలర్ల దిగువకు, నైమెక్స్‌ బ్యారల్‌ 45 డాలర్ల దిగువకు పతనమయ్యాయి. 

లాభాలతో
ప్రపం‍చ బ్యాంకుల స్టిములస్‌, ఒపెక్‌ కోతలపై అంచనాలతో సోమవారం చమురు ధరలు హైజం‍ప్‌ చేశాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 4.5 శాతం ఎగసి 51.90 డాలర్లకు చేరగా..  న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 4.5 శాతం పురోగమించి 46.75 డాలర్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం మరోసారి చమురు ధరలు పుంజుకున్నాయి. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 2.5 శాతం ఎగసి 53.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 3 శాతం పెరిగి 48.05 డాలర్లకు చేరింది. 

2008 తదుపరి
కరోనా భయాలతో గత వారం నైమెక్స్‌ చమురు ధరలు ఏకంగా 16 శాతం కుప్పకూలాయి. ఇది 2008 తదుపరి అత్యధిక నష్టంకాగా.. చైనాసహా ప్రపంచ జీడీపీ మందగిస్తే.. చమురుకు డిమాండ్‌ పడిపోవచ్చన్న ఆందోళనలు ధరల పతనానికి కారణమైనట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. దీంతో బ్రెంట్‌ బ్యారల్‌ ధరలు సైతం గత వారం 14 శాతం క్షీణించాయి. 2016 జనవరి తదుపరి ఒకే వారంలో ఇంత నష్టం నమోదుకావడం మళ్లీ ఇప్పుడేనని విశ్లేషకులు తెలియజేశారు!



You may be interested

నోకియా సీఈఓ రాజీవ్ సూరి రాజీనామా

Tuesday 3rd March 2020

లండన్‌: భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి నోకియా ప్రెసిడెంట్‌, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. సంస్థకు 25 ఏళ్ల పాటు సేవలందించిన సూరి తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామాను సమర్పించారని నోకియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 31తో ఈయన పదవీకాలం ముగియనుండగా.. నూతన ప్రెసిడెంట్‌, సీఈఓగా పెక్కా లండ్‌మార్క్ పేరును కంపెనీ బోర్డు ఖరారుచేసింది. సూరీ పదవీకాలం ముగిసినప్పటికీ.. వచ్చే ఏడాది జనవరి

300 పాయింట్ల గ్యాప్‌ అప్‌తో సెనెక్స్‌ ప్రారంభం

Tuesday 3rd March 2020

అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 300.34 పాయింట్ల లాభంతో 38444.36, నిఫ్టీ  147.3 పాయింట్లు పెరిగి 11280.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధితో  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న తరుణంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)లు తమ సభ్య దేశాలకు ఆర్థిక సాయంతో సహా అన్ని విధాలుగా చేయూత నిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామినివ్వడంతో ప్రపంచ

Most from this category