తగ్గిన చమురు
By Sakshi

డిమాండ్ సీజన్లో కూడా చమురు డిమాండ్ బలహీనంగా ఉండడంతో పాటు, అమెరికా చమురు ఉత్పత్తి తిరిగి గాడిలో పడడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ఉన్నాయి. వీటితో పాటు గత వారం గ్యాసోలిన్ ఉత్పత్తి పెరగడంతో బ్రెంట్ క్రూడ్ 0.2 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.51 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ 0.5 శాతం తగ్గి బ్యారెల్‌కు 56.52 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.1 శాతం, డబ్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 1.5 శాతం నష్టపోయి ముగిశాయి. అమెరికా చమురు నిల్వలు అంచనాల కంటే తక్కువ పడిపోవడంతో గత నాలుగు సెషన్ల నుంచి చమురు నష్టాల్లో ట్రేడవుతోంది.
ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై చర్చలు జరపడానికి నిరాకరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో మంగళవారం ప్రకటించారు. కానీ ఇది ఇరాన్‌తో ఉన్న వివాదాలపై అమెరికా పురోగతి సాధించిందని ట్రంప్ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఉండడం గమనర్హం. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలు చమురు ధరలకు మద్ధతునిస్తున్నాయి. దీంతో పాటు హరికేన్ ప్రభావం వలన అమెరికా చమురు నిల్వలు తగ్గాయి. కానీ ఈ తగ్గుదల అంచనాల కంటే తక్కువగా ఉంది.
‘గత వారంలో(జులై 12 వరకు ) అమెరికా చమురు నిల్వలు 27 లక్షల బ్యారెల్లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే ఇది 14లక్షల బ్యారెల్లు తగ్గి 4,600 లక్షల బ్యారెల్లకు చేరుకుంది. దీంతో పాటు గ్యాసోలిన్ నిల్వలు 925,000 బ్యారెల్లా తగ్గుదలను అంచనా వేయగా అది 476,000 బ్యారెల్స్‌గా నమోదయ్యింది. డీజిల్, హీటింగ్ ఆయిల్ వంటి స్వేదన ఇందనాల నిల్వలు 61.3 లక్షలు పెరుగుతాయని అంచనా వేయగా ఇది 62 లక్షలు పెరిగింది’ అని అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం తెలిపింది.
You may be interested
68.75 వద్ద రూపీ ప్రారంభం
Thursday 18th July 2019రూపీ డాలర్ మారకంలో 0.04 శాతం బలహీనపడి 68.76 వద్ద గురువారం ట్రేడవుతోంది. విదేశి పెట్టుబడులు ఔట్‌ఫ్లో ఉండడంతో గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో 11 పైసలు కోల్పోయి 68.82 వద్ద ముగిసింది. దీంతో పాటు దేశియ మార్కెట్లలో మదుపర్లు జాగ్రత్త వహించడంతో రూపీ బలహీన పడింది. మేజర్ కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్ బలహీన పడడంతో రూపీ కొంత వరకు కొలుకోగలిగింది. గత సెషన్లో ఇంటర్ బ్యాంక్ ఫారిన్
గురువారం వార్తల్లోని షేర్లు
Thursday 18th July 2019వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు మైండ్ ట్రీ:- నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్ ఎన్నికయ్యారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్:- భూషణ్ పవర్ రూ.238 కోట్లను మోసానికి పాల్పడినట్లు ఆర్బీఐకు సమాచారం ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్:- తాత్కలిక నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సంజీవ్ మిశ్రా నియమానికి రద్దు చేశారు. ఆయన స్థానంలో రాకేష్ మఖిజా పదవి బాధ్యతలు స్వీకరించవచ్చు. సుజ్లాన్ ఎనర్జీ:- కంపెనీ రుణాల పరిష్కారానికి సంపూర్ణంగా