News


60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Tuesday 1st October 2019
Markets_main1569907086.png-28648

   యూఎస్‌, రష్యా దేశాల చమురు ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.16 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం​లాభపడి బారెల్‌ 59.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.91 శాతం లాభపడి బారెల్‌కు 54.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
   ‘స్వల్పకాలానికి గాను పెట్టుబడులు పెట్టిన ఆసియా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు’ అని ఓండా, ఆసియా పసిఫిక్‌ సినియర్‌ విశ్లేషకుడు జెఫ్రే హ్యాలీ అన్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం, సౌదీ చమురు ఉత్పత్తి తిరిగి సాధరణ స్థాయికి రావడం వంటి అంశాల వలన మధ్యప్రాచ్య ఒత్తిళ్లు చమురు ధరలపై పాజిటివ్‌ ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి’ అని ఆయన  వివరించారు. కాగా డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత సౌదీ ఆరాంకో తన పూర్తి చమురు ఉత్పత్తి సామర్ధ్యానికి తిరిగి చేరుకోగలిగింది. అయినప్పటికి ఒపెక్‌ (చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) దేశాల చమురు ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో(రోజుకు 289 లక్షల బారెల్స్‌), నెలవారి ప్రకారం ఎనిమిదేళ్లలో కనిష్ఠానికి పడిపోయింది. వీటితో పాటు యూఎస్‌, రష్యా దేశాల చమురు ఉత్పత్తి వరుసగా జులై, సెప్టెంబర్‌ నెలలో  తగ్గాయి. రష్యా చమురు ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో రోజుకు 1,124 లక్షల బారెల్స్‌గా ఉండగా, ఇది జులై నెలలో 1,129 లక్షల బారెల్స్‌గా ఉండడం గమనార్హం. కానీ ఇది ఓపెక్‌, రష్యా దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలోని పరిమాణం కన్నా ఎక్కువని రాయిటర్స్‌ తెలిపింది. 
  యూఎస్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తి జులై నెలలో  రోజుకు 276,000 బారెల్స్‌ తగ్గి 1,181 లక్షల బీపీడీ(బారెల్స్‌ పెర్‌ డే)గా నమోదయ్యిందని యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన​ ఓ నివేదికలో పేర్కొంది.



You may be interested

20% పడిపోయిన బజాజ్‌ అమ్మకాలు

Tuesday 1st October 2019

ద్విచక్ర, త్రి చక్ర వాహనాల తయారి సంస్థయిన బజాజ్‌ ఆటో సెప్టెంబర్‌ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 20 శాతం పడిపోయాయి. ఇది విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ కావడం గమనార్హం. కాగా డిమాండ్‌ తగ్గడంతో గత కొంత కాలం నుంచి ఆటో కంపెనీల అమ్మకాలు తగ్గుతున్న విషయం తెలిసిందే.    సెప్టెంబర్‌ నెలలో వాహన విక్రయాలు 4.02 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో

గరిష్టస్థాయి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 400 పాయింట్లు డౌన్‌

Tuesday 1st October 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఆరంభలాభాల్ని కోల్పోయింది. నేడు ఇండెక్స్‌ 123 పాయింట్ల లాభంతో 29,226.15 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.50శాతం(423 పాయింట్లు) పెరిగి 29526.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతరం అనూహ్యం‍గా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ గరిష్టస్థాయి(29526.40) నుంచి పతనమైంది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ లాభాలు హరించుకుపోయి అరశాతం

Most from this category