News


బీపీసీఎల్‌కు వేటిలో వాటాలు ఉన్నాయో తెలుసా?

Friday 22nd November 2019
Markets_main1574420317.png-29793

ప్రభుత్వ రంగ చమురు కంపెనీ బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు తగిన ఇన్వెస్టర్‌ వేటలో ఉంది. కంపెనీ వాటా విక్రయానికి ముందు కంపెనీ అసెట్స్‌ను వేరు చేసే పనిలోఉంది. ఇందులో భాగంగా కంపెనీకి వివిధ జేవీల్లో ఉన్న వాటాలను మదింపు చేస్తోంది. పలు పీఎస్‌యూ చమురు కంపెనీల్లాగే బీపీసీఎల్‌కు అనేక క్రాస్‌ హోల్డింగ్స్‌ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఇతర ఆదాయాలు దాదాపు 13- 28 శాతం ఉంటాయని క్యాపిటల్‌లైన్‌ డేటా చెబుతోంది. అందువల్ల ఫెయిర్‌ వాల్యూ లెక్కించే సమయంలో మార్కెట్లు ఆయా కంపెనీల విలువలో 20- 30 శాతాన్ని హోల్డింగ్స్‌ కంపెనీ డిస్కౌంట్‌ రూపంలో తగ్గించుకొని లెక్కించుకుంటాయి. 
బీపీసీఎల్‌కు పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీలో 12.5 శాతం వాటా ఉంది. ఇంద్రప్రస్థ గ్యాస్‌లో 22.5 శాతం వాటా ఉంది. ఓఐఎల్‌లో 2.47 శాతం వాటా ఉంది. గురువారం ముగింపు ప్రకారం లెక్కిస్తే కంపెనీ లిస్టెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విలువ రూ. 12095 కోట్లుంది. ఒకవేళ ఈ వాటాలన్నీ వదిలించుకోవాలని బీపీసీఎల్‌ భావిస్తే ఆయా కంపెనీల షేర్ల లిక్విడిటీ పెరిగి వాటి ధరలు క్షీణించే అవకాశాలున్నాయి. ఇక అన్‌లిస్టెడ్‌ పెట్టుబడులను చూస్తే బీపీసీఎల్‌కు నుమాలిగఢ్‌ రిఫైనరీలో 61.6 శాతం వాటా ఉంది. దీని బుక్‌ వాల్యూ రూ. 5551 కోట్లని అంచనా. దీనిలో వాటాను కంపెనీ ఎలా వదిలించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 


సాధారణంగా కంపెనీలు ఇతర కంపెనీలను కొనుగోలు చేసే సమయంలో లిస్టెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నగదుతో సమానంగా భావిస్తాయి కాబట్టి, వీటితో సమస్య ఉండదు. అదే అన్‌లిస్టెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మాత్రం వద్దనుకుంటాయి. అందువల్ల వీటిని వదిలించుకొనే కంపెనీలు వాటాల విక్రయాలకు వెళుతుంటాయి. 



You may be interested

స్టాక్స్‌ వ్యాల్యూషన్లపైనే దృష్టి పెట్టండి: ప్రశాంత్‌ జైన్‌

Saturday 23rd November 2019

దేశ జీడీపీ తాత్కాలికంగా క్షీణించిందని స్టాక్‌మార్కెట్‌ పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉండడం సరికాదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అయిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన్‌ మాట్లాడుతూ విలువైన విషయాలను ఇన్వెస్టర్లకు తెలియజేశారు.    ‘జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 5 శాతానికి పడిపోవచ్చు. అయితే, అది అక్కడే ఉండిపోదన్న’ విషయాన్ని ప్రశాంత్‌ జైన్‌

సెన్సెక్స్‌ నష్టం 216 పాయింట్లు

Friday 22nd November 2019

54పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఐటీ షేర్లకు రేటింగ్‌ షాక్‌ వారాంతపు చివరి రోజైన శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 54పాయింట్లు నష్టంతో 11,914.40 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 216 పాయింట్లను కోల్పోయి 40359.41 వద్ద స్థిరపడింది. సూచీలకి వరుసగా ఇది రెండో రోజూ నష్టాల ముగింపు. ఐటీ రంగ షేర్ల భారీ పతనం, సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌

Most from this category