STOCKS

News


బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు!

Friday 27th September 2019
Markets_main1569581025.png-28592

వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిలు 6 లార్జ్‌క్యాప్‌ షేర్లను దీర్ఘకాలానికి కొనొచ్చని  సిఫార్సుచేస్తున్నాయి. అవి... 
బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ
భారతీ ఇన్ఫ్రాటెల్‌ స్టాక్‌పై ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను క్రెడిట్‌ సూసీ ఇచ్చింది. ఈ స్టాకు టార్గెట్‌ ధరను రూ. 330 గా నిర్ణయించింది. తాజా దిద్దుబాటు తర్వాత ఈ స్టాక్‌ వాల్యుషన్‌ ఆకర్షణీయంగా ఉందని, టెలికాం సెక్టార్‌లో ఈ స్టాక్‌ను పరిశీలించవచ్చని సలహాయిచ్చింది. అంతేకాకుండా కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వలన ఈ స్టాక్‌ ఈపీఎస్‌(షేరుపై లాభం) అంచనాలను 28శాతం నుంచి 45 శాతానికి పెంచింది.

బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ
మోర్గాన్‌ స్టాన్లీ, జేఎస్‌పీఎల్‌(జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌) స్టాక్‌పై ఓవర్‌వెయిట్‌ను కలిగి ఉండి, ఈ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ. 139 గా నిర్ణయించింది. బలహీన డిమాండ్‌ వాతవరణం కొనసాగుతున్నప్పటికి ఈ కంపెనీ లాభదాయకత బాగుంటుందని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2016 లో ఏర్పడిన డౌన్‌ సైకిల్‌తో పోలిస్తే ప్రస్తుతం కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా ఉందని ఈ బ్రోకరేజి తెలిపింది.

బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ
మోర్గాన్‌ స్టాన్లీ, మారుతి సుజుకీ స్టాక్‌పై ఓవర్‌ వెయిట్‌ను కలిగివుండి, ఈ స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ. 7,181 స్థాయి నుంచి రూ. 8,205 కు పెం‍చింది. ఈ సెక్టార్‌లో అమ్మకాల పరిమాణాలు పడిపోయాయని తెలిపింది. కానీ సమీప భవిష్యత్తులో అంచనావేస్తున్న అప్‌ సైకిల్‌లో మారుతి మంచి స్థానంలో ఉందని వివరించింది. అంతేకాకుండా ఈ కంపెనీ నిర్వహాణ సామర్ధ్య మెరుగుదల కంపెనీ మార్జిన్స్‌ పెరగడానికి సహాయపడతాయని తెలిపింది.

బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ
మోర్గాన్‌ స్టాన్లీ, ఐటీసీ స్టాక్‌పై ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌నిచ్చింది. అంతేకాకుండా ఈ స్టాక్‌ టార్గెట్‌ ధరనున రూ. 370 గా నిర్ణయించింది. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వలన ఈ కంపెని అధికంగా లాభపడనుందని, ధరలను పెంచుకునే వెసులుబాటు దీర్ఘకాలం వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. 

బ్రోకరేజి: సిటీ
సీటీ, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ స్టాక్‌పై బై రేటింగ్‌నిచ్చింది. ఈ కంపెనీ స్టాక్‌పై టార్గెట్‌ ధరను రూ. 1,800 గా నిర్ణయించింది. కంపెనీ మేనేజ్‌మెంట్‌ బలంగా ఉందని, నిర్వహణ సామర్ధ్యం కూడా బాగుందని తెలిపింది. అంతేకాకుండా ఐటీ సెక్టార్‌ మిడ్‌ క్యాప్స్‌లో ఈ స్టాక్‌పై మాత్రమే తాము బై రేటింగ్‌ కలిగి ఉన్నామని ఈ బ్రోకరేజి వివరించింది. కానీ మైండ్‌ ట్రీ వివాదంపై సాధరణ ఇన్వెస్టర్‌ అనుమానంతో ఉన్నాడని, అయినప్పటికి పోటీ కంపెనీలతో పోల్చుకుంటే ఈ కంపెనీ మంచి వృద్ధిని ప్రదర్శిస్తుందని తాము అంచనావేస్తున్నామని తెలిపింది.

బ్రోకరేజి: సీఎల్‌ఎస్‌ఏ
సీఎల్‌ఎస్‌ఏ, ఎన్‌టీపీసీ స్టాక్‌పై బై రేటింగ్‌నిచ్చి, టార్గెట్‌ ధరను రూ. 165 గా నిర్ణయించింది. టెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీహెచ్‌డీసీ)ను కొనుగోలు చేయాలని ఎన్‌టీపీసీ ప్రయత్నిస్తుంది. ‘ఒక వేళ ఈ టేకోవర్‌ జరిగితే..ఎన్‌టీపీసీ హెడ్రో పవర్‌ ఉత్పత్తి సామర్ధ్యం 2.5 రెట్లు పెరుగుతుంది. అంతేకాకుండా సోలార్‌ మూలధన వ్యయంపై ఉన్న ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక సంవత్సరం 2020కి గాను ఎన్‌టీపీసీ నిర్వహణ ఈక్విటీ 5 శాతం అదనంగా పెరుగుతుంది’ అని ఈ బ్రోకరేజి తెలిపింది.You may be interested

చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు!

Saturday 28th September 2019

డైరెక్టర్లపై మోసపూరిత ఆరోపణలు ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు న్యూఢిల్లీ: మరో ప్రైవేటు బ్యాంకులో ముసలం మొదలైంది. చెన్నై కేంద్రంగా దక్షిణాదిలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించే లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఆరోపణల్లో చిక్కుకుంది. బ్యాంకు బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలతో ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ‘‘ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం 2019 సెప్టెంబర్‌ 23న ఎల్‌వీబీ బోర్డు డైరెక్టర్లు, తదితరులపై మోసం, విశ్వాస ఘాతుకం,

నష్టాల ముగింపు

Friday 27th September 2019

మార్కెట్‌ లాభం ఒక్కరోజుకే పరిమితమైంది. సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 167.17 పాయింట్లు నష్టపోయి 39000 దిగువున 38,822.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 59 పాయింట్లు కోల్పోయి 11500 స్థాయి కింద 11,512.40 వద్ద ముగిసింది. అన్నిరంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలమైన బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 38,000 దిగువున 29,876.65 వద్ద

Most from this category