News


ఫార్మా ఫలితాలపై క్రెడిట్‌ సూసీ అంచనాలు

Friday 4th January 2019
Markets_main1546594699.png-23413

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అరబిందో ఫార్మా, టొరెంట్‌ ఫార్మా, కాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు బలమైన ఫలితాలు నమోదు చేస్తాయని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ అంచనా వేసింది. ఇదే సమయంలో సిప్లా, డా.రెడ్డీస్‌ పేలవ ఫలితాలు చూపుతాయని అభిప్రాయపడింది. సన్‌ఫార్మా ఫలితాలు ఇలుమ్యా మందు కారణంగా బాగానే ఉండొచ్చని కానీ ఎబిటా మాత్రం దెబ్బతింటుందని, అధిక ప్రమోషన్‌ వ్యయాలే ఇందుకు కారణమని వివరించింది. డా.రెడ్డీస్‌ ఫలితాల్లో ఎబిటా క్రమానుగత క్షీణత ఉంటుందని తెలిపింది. లుమిన్‌ ఫలితాల్లో మార్జిన్లు మెరుగుపడవచ్చని కానీ టామిఫ్లూ సీజన్‌ బలహీనంగా ఉండడం ప్రభావం చూపవచ్చని తెలిపింది.

అరబిందో మూడో త్రైమాసిక యూఎస్‌ విక్రయాలు అదరగొడతాయని అంచనా వేసింది. కాడిలా హెల్త్‌కేర్‌ సైతం యూఎస్‌లో మంచి విక్రయాలు నమోదు చేయవచ్చని కానీ గత గైడెన్స్‌ అంచనాలను అందుకోలేకపోవచ్చని వివరించింది. టొరెంట్‌ ఫార్మా విషయంలో యూఎస్‌, ఇండియా వ్యాపారాల్లో పురోగతి కారణంగా మార్జిన్లు పెరగవచ్చని అంచనా వేసింది. గ్లెన్‌మార్క్‌కు వాజిఫామ్‌ పునర్వ్యస్థీకరణ కలిసివస్తుందని అభిప్రాయపడింది. You may be interested

యూఎస్‌ మార్కెట్‌ సద్దుమణగాలి!

Friday 4th January 2019

యూఎస్‌ మార్కెట్లలో అలజడి సద్దు మణిగితేనే ఈ ఏడాది భారత్‌తో పాటు ఇతర వర్దమాన దేశాల మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌ సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. అయితే స్వల్పకాలానికి యూఎస్‌ మార్కెట్లో అలజడులుల తగ్గకపోవచ్చని, తీవ్రమైన కదలికలు నమోదవుతాయని అంచనా వేశారు. యూఎస్‌ మార్కెట్లు 5- 10 శాతం పడిపోయినా భారత మార్కెట్లు మంచిగానే ఉంటాయని, కానీ పాజిటివ్‌ రాబడులు పెద్దగా ఉండవని విశ్లేషించారు. గత

ఐదు ఐటీ కంపెనీలు... 4.8 శాతం వృద్ది

Friday 4th January 2019

సీఐఎంబీ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ షురూ కానుంది. ఈ నెల 10న టీసీఎస్‌, 11న ఇన్ఫోసిస్‌ ఫలితాల వెల్లడితో సీజన్‌ ఆరంభమవుతోంది. రూపాయి పతనం, యూఎస్‌లో వృద్ధి కారణంగా ఈసారి ఫలితాల్లో ఐటీ సంస్థలు మంచి జోరు చూపవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలో టాప్‌ 5 ఐటీ కంపెనీలు సరాసరిన 1.5- 4.8 శాతం వృద్ది నమోదు చేయవచ్చని గ్లోబల్‌

Most from this category